బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్: 104 నాటౌట్, చివరికి డెలివరి బాయ్ చిక్కాడు, అక్కడే ఫైన్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సర్వసాధారణంగా పొరపాటున ఒకటి రేదా రెండు సార్లు ట్రాఫిక్ ఉల్లంఘించి అపరాద రుసుం చెల్లించిన వారి గురించి చూశాం. పొరపాటున ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి తప్పు జరిగిందని పోలీసుల దగ్గర వాపోయిన వారి గురించి తెలుసుకున్నాం. అయితే ఒక యువకుడు ఏకంగా 104 సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి ట్రాఫిక్ పోలీసులకు సినిమా చూపించాడు. చివరికి హెల్మెట్ పెట్టుకోకుండా దర్జాగా వెలుతున్న యువకుడిని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అంతే అతని స్కూటర్ నెంబర్ టైప్ చెయ్యడంతో 104 సార్లు నియమాలు ఉల్లంఘించాడని తెలుసుకుని అక్కడికక్కడే అపరాద రుసుం వసూలు చేశారు.

అమెజాన్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం కేసులో ట్విస్ట్: యువతి రివర్స్, అంతే !అమెజాన్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం కేసులో ట్విస్ట్: యువతి రివర్స్, అంతే !

 జాలహళ్ళి జులాయి

జాలహళ్ళి జులాయి

బెంగళూరు నగరంలోని జాలహళ్ళిలో మహమ్మద్ షబీర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మహమ్మద్ షబీర్ ఆహారం డెలివరి చేసే ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను ఆదివారం హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటల్ అతి వేగంగా వెలుతున్నాడు. విషయం గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు మహమ్మద్ షబీర్ స్కూటర్ ను నిలిపారు. అయితే అక్కడి నుంచి తప్పించుకోవడానికి మహమ్మద్ షబీర్ ప్రయత్నించాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు చివరికి మహమ్మద్ షబీర్ ను పట్టుకున్నారు.

 పోలీసుల దిమ్మతిరిగింది

పోలీసుల దిమ్మతిరిగింది

మహమ్మద్ షబీర్ స్కూటర్ నెంబర్ ను ట్రాఫిక్ పోలీసులు వారి యత్రంలో టైప్ చేసి చూశారు. అంతే మహమ్మద్ షబీర్ వందసార్లుకు పైగా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి స్కూటర్ నడిపాడని తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసుల దిమ్మతిరిగింది. అన్ని సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన మహమ్మద్ షబీర్ ఒక్కసారి కూడా ట్రాఫిక్ పోలీసుల చేతికి చిక్కలేదు.

104 నాటౌట్

104 నాటౌట్

మహమ్మద్ షబీర్ హెల్మెట్ లేకుండా స్కూటర్ నడపడం, సిగ్నల్ జంప్, స్కూటర్ నడుపుతున్ప సమయంలో మొబైల్ ఫోన్ లో మాట్లాడటం, జీబ్రా లైన్ క్రాస్ చెయ్యడం తదితర ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించాడని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వెంటనే సంఘటనా స్థలంలోనే మహమ్మద్ షబీర్ కు రూ. 10 వేల అపరాద రుసుం విదించారు.

 డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

104 సార్లు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన మహమ్మద్ షబీర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చెయ్యాలని రవాణా శాఖ అధికారులకు మనవి చేస్తామని జాలహళ్ళి ట్రాఫిక్ పోలీసులు అన్నారు. మహమ్మద్ షబీర్ నుంచి అపరాద రుసుం వసూలు చేసి ఇక ముందు అతను అలాగే వాహనం నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామని ట్రాఫిక్ పోలీసులు అన్నారు. జాలహళ్ళితో పాటు బెంగళూరు నగరంలోని వివిద ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మహమ్మద్ షబీర్ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించాడని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

 రోడ్డు మీద గొడవలు

రోడ్డు మీద గొడవలు

విపరీతమైన ట్రాఫిక్ ఫైన్ లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వాహనచోదకులు ట్రాఫిక్ పోలీసుల మీద విరుచుకుపడుతున్నారు. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు, వాహనచోదకుల మధ్య ట్రాఫిక్ ఫైన్ వసూలు చేసే విషయంలో వాగ్వివాదాలు జరుగుతున్నాయి.

English summary
Bengaluru: Food delivery executive Mohammed Shabbir had the shock of his life when the Honda Activa he was riding was flagged down at Ramachandrapura cross near Jalahalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X