భారత్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ -జనవరి నుంచే షురూ -అక్టోబరు నాటికి సాధారణం: సీరం సీఈవో
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఆదివారం నాటి 30,254 కొత్త కేసులతో కలిపి భారత్ లో ఇన్ఫెక్షన్ల సంఖ్య 1కోటికి చేరువైంది. మరణాల సంఖ్య 1.5లక్షలకు దగ్గరగా ఉంది. దేశంలో వ్యాక్సిన్ పంపిణీ, నిర్వహణకు కేంద్రం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అదే సమయంలో వ్యాక్సిన్ తయారీలో ఫ్రంట్ రన్నర్ గా ఉన్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సైతం కీలక ప్రకటన చేసింది..
Recommended Video
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరిలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. 2021 సెప్టెంబరు - అక్టోబరుకల్లా జనజీవనం పూర్వస్థితికి చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తమ వ్యాక్సిన్ (ఆక్స్‌ఫర్డ్) అత్యవసర వినియోగానికి నియంత్రణ సంస్థల నుంచి ఈ నెలాఖరులోగా అనుమతులు మంజూరవుతాయని విశ్వాసం వెలిబుచ్చారు.

తొలి దశలో దేశ జనాభాలో 20-30 శాతం మందికి టీకాలు వేయాలని, జూలై 2021నాటికి 300-400 మిలియన్ మోతాదులను సిద్ధంగా ఉంచాలని కేంద్రం యోచిస్తున్నదని, 20 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత ప్రజల్లో విశ్వాసం పుంజు కుంటుందని, వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ టీకాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నానని పూనావాలా చెప్పారు. 'ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ‍్యలు చేశారు. కాగా,
కరోనా వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో ఎన్నికల సంఘం సేవలను కూడా వాడుకోబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో దాదాపు 60 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించే బృహత్తర కార్యక్రమం కోసం ఎన్నికల యంత్రాంగాన్ని వాడుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications