వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేనెటీగలకు వ్యాక్సీన్.. ప్రపంచంలోనే తొలిసారి... దీన్ని ఎలా ఇస్తారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తేనెటీగలు

ప్రపంచంలోనే తొలిసారిగా తేనెటీగల కోసం వ్యాక్సీన్‌ అందుబాటులోకి వచ్చింది. అమెరికా దీనికి ఆమోదం పలికింది.

'అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్’ నుంచి తేనెటీగలు మృత్యువాత పడకుండా ఈ వ్యాక్సీన్ కాపాడుతుంది.

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్(యూఎస్‌డీఏ) ఈ వ్యాక్సీన్‌కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు దీని తయారీ సంస్థ యలాన్ యానిమల్ హెల్త్ వెల్లడించింది.

మొక్కల్లో పరాగ సంపర్కానికి సహకరించే జీవులుగా పర్యావరణంలో తేనెటీగల పాత్ర కీలకం.

తేనెటీగల పెంపకం

'తేనెటీగలను బతికించడానికి ఈ వ్యాక్సీన్ కీలకం కానుంది’ అని డలాన్ యానిమల్ హెల్త్ సీఈవో అన్నెట్ క్లైజర్ ఓ ప్రకటనలో తెలిపారు.

రాణి ఈగకు ఈ వ్యాక్సీన్‌ను ఇవ్వడం ద్వారా లార్వాలు రోగనిరోధక శక్తిని సంతరించుకునేలా చేస్తారు.

అమెరికాలో 2006 నుంచి తేనెటీగల గుంపులు తగ్గిపోతున్నాయని యూఎస్‌డీఏ గణాంకాలు చెప్తున్నాయి.

తేనెటీగల ఆరోగ్యంపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయని.. పరాన్నజీవులు, కీటకాలు, వ్యాధులు, ఏకంగా గుంపులుగుంపులు ఒకేసారి చనిపోవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా వ్యాధులు వంటివన్నీ వాటి మరణానికి కారణమవుతున్నట్లు యూఎస్‌డీఏ చెప్పింది.

ప్రపంచంలోని పంట ఉత్పత్తులలో మూడో వంతుకు కారణం పరాగ సంపర్కానికి తోడ్పడే తేనెటీగలు, పక్షులు, గబ్బిలాలు వంటివేనని యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తోంది.

తేనెటీగ

కాగా అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్ కారణంగా తేనెటీగల పెంపకందారులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇంతవరకు ఈ వ్యాధికి చికిత్స అనేదే లేదు. అంతేకాదు... ఇది చాలావేగంగా వ్యాపించే వ్యాధి.

ఈ వ్యాధి వచ్చినట్లు గుర్తిస్తే తేనెటీగలను పెంచే పెట్టెలు, ఈగలు అన్నిటినీ మంటల్లో కాల్చడమే దీనికి పరిష్కారంగా ఉండేది ఇంతవరకు. అలా చేస్తే మిగతావాటికి వ్యాపించకుండా ఆగేది.

ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సీన్‌లో అమెరికన్ ఫౌల్‌బ్రూడ్ డిసీజ్‌కు కారణమయ్యే 'పేనిబాసిల్లస్ లార్వా’ బ్యాక్టీరియానే వాడుతారు. అయితే, అచేతన స్థితిలో ఉండే బ్యాక్టీరియా వ్యాక్సీన్‌లో ఉంటుందని డలాన్ యానిమల్ హెల్త్ చెప్పింది.

తేనెటీగ

తేనెతుట్టెలోని శ్రామిక ఈగలు రాణి ఈగకు అందించే ఆహారం రాయల్ జెల్లీలో వ్యాక్సీన్ ద్వారా ఈ బ్యాక్టీరియాను ప్రవేశపెడతారు. ఆ ఆహారం ద్వారా రాణి ఈగకు అందే రోగనిరోధక బ్యాక్టీరియా దాని అండాశయాలలోకి చేరుతుందని వ్యాక్సీన్ తయారీ సంస్థ చెప్పింది.

రాణి ఈగ అండాశయాలలోకి వ్యాక్సీన్ చేరడం వల్ల అది లార్వాకు రోగనిరోధక శక్తిని కలిగిస్తుందని.. దానివల్ల కొత్తగా జన్మించే ఈగలు ఈ వ్యాధిని తట్టుకోగలుగుతాయని చెప్తోంది.

ఈ కొత్త వ్యాక్సీన్ తేనెటీగల పెంపకందారులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు కాలిఫోర్నియా రాష్ట్ర తేనెటీగల పెంపకందారుల సంఘం సభ్యుడు ట్రెవర్ టౌజర్ చెప్పారు.

వ్యాక్సీన్ ఈ ఏడాదే పరిమిత సంఖ్యలో అందుబాటులోకి రానుందని తయారీ సంస్థ డలాన్ వెల్లడించింది.

ఇవి కూడ చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Vaccine for bees.. first time in the world... how to give it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X