వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశాన్ని రిస్క్‌లో పెట్టి విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతులా ? ప్రధానికి రాహుల్ ప్రశ్న

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే అత్యంత వేగంగా కరోనా వైరస్ విస్తరిస్తోందని కేంద్రం చెబుతోంది. ఇదే అంశంపై నిన్న ముఖ్యమంత్రులతో వర్చువల్‌ భేటీ నిర్వహించిన ప్రధాని మోడీ.. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఇదే క్రమంలో ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని సూచించారు. అంటే ఈ నాలుగు రోజుల పాటు దేశవ్యాప్తంగా టీకా పంపిణీని వేడుకలా నిర్వహించాలని సూచించారు.

ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో చేసిన టీకా ఉత్సవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీ మండిపడ్డారు. ఓవైపు వ్యాక్సిన్ల కొరతతో దేశం అల్లాడుతుంటే టీకా ఉత్సవాలు చేయమంటూ ప్రధాని మోడీ పిలుపునివ్వడంపై రాహుల్‌ ఫైర్ అయ్యారు. వ్యాక్సిన్ల కొరత అనేది తీవ్ర సమస్య అని, ఇది వేడుకగా నిర్వహించాల్సిన విషయం కాదని రాహుల్‌ ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని రాహుల్‌ తప్పుబట్టారు.

Vaccine Shortage A Serious Issue, Not Utsav: Rahul Gandhi Slams PMs Call

ఓవైపు దేశంలో వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సిన్‌ కేంద్రాలు మూతపడుతుంటే మరోవైపు విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతులేంటని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుంటే, వ్యాక్సిన్ల కొరత కూడా అదే స్ధాయిలో పెరుగుతోందని రాహుల్‌ తెలిపారు. దేశ ప్రజల్ని రిస్క్‌లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తారా అని రాహుల్‌ ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని రాష్ట్రాలకు కేంద్రం వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాహుల్‌ సూచించారు. మనమంతా కలిసి ఈ మహమ్మారిని ఓడించాలని రాహుల్‌ పిలుపునిచ్చారు.

Recommended Video

#Coronavirusinindia : PM Modi Gets Second Vaccine Dose ఈసారీ సైలెంట్‌గా కానిచ్చిన మోదీ !!

English summary
The shortage of vaccine doses against coronavirus is a serious issue and not an "utsav", Congress leader Rahul Gandhi said today, slamming Prime Minister Narendra Modi's call to observe a "tika utsav", or ''vaccine festival'', between April 11 and 14 to inoculate the maximum number of eligible beneficiaries across states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X