Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vaccination: వ్యాక్సిన్ వేస్తామంటే నదిలోకి జంప్, వ్యాక్సిన్ వేసి మమ్మల్ని చంపేస్తారా ? డేంజర్ !

లక్నో/చెన్నై: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్యం చేస్తోంది. కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని కట్టడి చెయ్యడానికి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్ డౌన్ మంచి ఫలితాలు ఇస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రానురాను తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇదే సమయంలో దేశ్యాప్తంగా కో వ్యాక్సిన్ వెయ్యడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటోంది. ఓ గ్రామంలో కోవ్యాక్సిన్ వెయ్యడానికి వెళ్లిన అధికారులకు స్థానిక గ్రామస్తులు పట్టపగలు చుక్కు చూపించారు. కరోనా ఎప్పుడో వస్తుంది, అప్పుడు మేము చచ్చినా పర్వాలేదు. మీరు వ్యాక్సిన్ వేసి ఇప్పడే మమ్మల్ని చంపేయాలని స్కెచ్ వేస్తున్నారా ? అని ఆరోపిస్తూ గ్రామస్తులు వెళ్లి నదిలో దూకేశారు. వ్యాక్సిన్ వేసుకుంటే మీరు బతుకుతారు, లక్షల మంది వేసుకున్నారు, ఎవ్వరికి ఏమీ కాలేదు అని అధికారులు చెబితే మీ స్టోరీసులు సినిమాల్లో చెప్పుకోండి మా దగ్గర కాదు అంటూ గ్రాములు మొండికేశారు. అధికారులు చేతులు మొక్కి వ్యాక్సిన్ వేసుకోవాలని మనవి చేస్తే, మీ డ్రామాలు మా దగ్గర కాదు, సినిమాల్లో వెయ్యండి, ఆక్కడ మీ ట్యాలెంట్ చూపించండి, మా దగ్గర కాదు అని గ్రామస్తులు తేల్చి చెప్పారు.

 సీఎం ఆదేశాలు...... అధికారులు !

సీఎం ఆదేశాలు...... అధికారులు !

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కో వ్యాక్సిన్ ప్రక్రియను విజయవంతం చెయ్యడానికి ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తోంది. ఉత్తరప్రదేశ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం చెయ్యాలని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశించారు.

 1,5000 మంది నివాసం

1,5000 మంది నివాసం

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలోని సర్సాండ గ్రామంలో సుమారు 1, 500 మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. సుర్సాండ గ్రామం సమీపంలోని సరయూ నది కూడా ఉంది. సుర్సాండ గ్రామంలో నివాసం ఉంటున్న ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ వెయ్యాని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు.

 దెబ్బకు గ్రామం మొత్తం ఖాళీ

దెబ్బకు గ్రామం మొత్తం ఖాళీ

సుర్సాండ గ్రామం సమీపంలో కోవ్యాక్సిన్ వెయ్యడానికి ఆరోగ్య శాఖ అధికారులు ఓ శిభిరం ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రాలేదు. వాలంటీర్లు, అంగన్ వాడి కార్యకర్తలు గ్రామస్తులను పిలుచుకుని రావడానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి గ్రామం మొత్తం ఖాళీ చేసి సరయూ నది సమీపంలోని ఘాట్ ల దగ్గరకు పరుగు తీశారు.

కరోనా ఎప్పుడో వస్తుంది..... వ్యాక్సిన్ వేసి ఇప్పుడే చంపేస్తారా ?

కరోనా ఎప్పుడో వస్తుంది..... వ్యాక్సిన్ వేసి ఇప్పుడే చంపేస్తారా ?

సరయూ నది సమీపంలోకి ఆరోగ్య శాఖా అధికారులు వెళ్లారు. ఓరినాయనో.... ఇక్కడికి దాపురించారా అంటూ గ్రామస్తులు బిత్తరపోయారు. బయటకు వెళ్లడానికి వేరే మార్గం లేపోవడంతో గ్రామస్లులు వ్యాక్సిన్ వేస్తారనే భయంతో ఆడవాళ్లతో సహ నదిలో దూకేశారు. ఈ సీన్ చూసిన ఆరోగ్య శాఖ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. మీకు కరోనా రాకుండా ఉండాలంటే వచ్చి వ్యాక్సిన్ వేసుకోండి అంటూ గ్రామస్తులకు మవని చేశారు. కరోనా ఎప్పుడో వస్తుంది. అది వచ్చినప్పుడు చూద్దాంలే, మీకు వ్యాక్సిన్ వేసి మమ్మల్ని ఇప్పుడే చంపేస్తారా అంటూ గ్రామస్తులు చెప్పడంతో అధికారు మతిపోయింది.

చేతులు ముక్కితే...... డ్రామాలు మా దగ్గర వెయ్యద్దు అంటూ డైలాగులు

చేతులు ముక్కితే...... డ్రామాలు మా దగ్గర వెయ్యద్దు అంటూ డైలాగులు


గ్రామస్తుల తీరుతో ఆరోగ్య శాఖ అధికారులు ఏమి చెయ్యాలో అర్థంకాక వారికి చేతులు జోడించి నమస్కారం చేసి నదిలో నుంచి బయటకు రావాలని మనవి చేశారు. నదిలో మునిగి చచ్చిపోతాము కాని మేము మాత్రం బయటకు మాత్రంరాము, మీ విషం ఇంజెక్షన్ వేసుకోము అని తేల్చి చెప్పారు. మీ డ్రామాలు మా దగ్గర వెయ్యకండి, సినిమాల్లో ట్రై చెయ్యండి అంటూ గ్రామస్తులు తేల్చి చెప్పారు.

మూడనమ్మకాలు ?

మూడనమ్మకాలు ?

సుర్సాండ గ్రామ ప్రజలు వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతామని మూడనమ్మకాలతో నదిలో దూకారని, వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించామని సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ రాజీవ్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు అక్కడ ఏర్పాటు చేసిన శిభిరానికి కేవలం 18 మంది మాత్రమే వెళ్లి కోవ్యాక్సిన్ వేసుకున్నారని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. కో వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతామనే భయంతో ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా ఉత్తరప్రదేశ్ లోని సర్సాండా గ్రామ ప్రజలు సరయూ నదిలో దూకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+