ఫ్లవర్ షో, తేనేటీగల దాడికి బాలిక బలి
బెంగళూరు: కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లవర్ షో చూడటానికి వెళ్లిన సమయంలో తేనేటీగల దాడిలో తీవ్రగాయాలైన బాలిక మరణించిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. వైష్ణవి (7) అనే బాలిక మరణించిందని సిద్దాపుర పోలీసులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని పద్మనాభనగరలో గురుప్రసాద్, సుగుణ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె వైష్ణవి. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా లాల్ బాగ్ లో ప్రత్యేకంగా ఎర్పాటు చేసిన ఫ్లవర్ షో చూడటానికి గురుప్రసాద్ కుటుంబ సభ్యులు వెళ్లారు.

ఆ సందర్బంలో వైష్ణవి ఫ్లవర్ షో చూసి మురిసిపోయింది. చాల సేపు ఉల్లాసంగా గడిపింది. తరువాత ప్లవర్ షో పక్కనే ఉన్న కంపేగౌడ టవర్ దగ్గర ఆడుకుంటున్న సమయంలో తేనేటీగలు దాడి చేశాయి. బాలికను ఆమె తండ్రి గురుప్రసాద్ రక్షించడానికి వెళ్లిన సమయంలో అతని మీద తేనేటీగలు దాడి చేశాయి.
తీవ్రగాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై బుధవారం వైష్ణవి మరణించిందని సిద్దాపుర పోలీసులు తెలిపారు. గురుప్రసాద్ కోలుకుంటున్నాడు. ఫ్లవర్ షో చూడటానికి వెళ్లడంతో పాప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications