భారీగా కురిసిన మంచు: విరామం లేకుండా శ్రమించి 680 మందిని కాపాడిన ఆర్మీ

Posted By:
Subscribe to Oneindia Telugu

ఈటానగర్: అంతగా కనిపించని, వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించని సమయంలో అక్కడ చిక్కుకుపోయిన 680 మందిని భారత సైన్యం రక్షించింది. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు సాయం చేయడంలో జవాన్లు ముందుంటారు.

అరుణ్ చల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌, సీలాపాస్‌ తదితర ప్రాంతాల్లో మంచు బాగా కురవడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. లోయలో 680 మంది చిక్కుకుపోయారు. విషయం తెలియగానే సైన్యం రంగంలోకి దిగింది.

Valiant Army Jawans Rescue 680 Stranded Tourists in Blizzard-hit Arunachal Pradesh

రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 7 గంటలకు విరామం కూడా తీసుకోకుండా ఆపరేషన్‌ నిర్వహించి ప్రజలను రక్షించారు. తమ భుజాలపైకి ఎక్కించుకుని వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a daring operation, Army jawans rescued 680 people who were stranded at Sela Pass in West Kameng district of Arunachal Pradesh due to unexpected blizzard conditions on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి