గ్యాంగ్ రేప్ కట్టుకథ: మహిళపై పోలీసుల చర్యలు
వారణాసి: తనపై సామూహిక అత్యాచారం చేశారని తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చందౌలీ జిల్లా మొఘల్‌సరాయ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మాలోఖర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసింది. ఆ ఆరోపణ తప్పని తేలడంతో పోలీసులు గుర్రుమంటున్నారు.
జూన్ 3వ తేదీన ఓ యువకుడు మలోఖర్ గ్రామంలోని తమ ఇంటికి వచ్చి ఆటో డ్రైవర్ అయిన తన వారణాసిలో భర్త ప్రమాదానికి గురైనట్లు చెప్పాడని, తన ఇద్దరు పిల్లలతో తాను ఆ యువకుడితో వారణాసికి వెళ్లామని ఆమె ఈ నెల 5వ తేదీన చేసిన ఫిర్యాదులో చెప్పింది. ఆ తర్వాత సరైయ్యాలో ఓ గదిలో తనను బంధించారని, జూన్ 4వతేదీన శివపురి ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆరుగురు తనపై తన పిల్లల ముందే అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది.

ఐదో తేదీన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భర్తకు విషయం చెప్పింది. ఆమె ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, అత్యాచారం జరగలేదని వైద్య పరీక్షల్లో తేలింది.
దాంతో పోలీసులు మహిళను విచారించారు. తాను తప్పుడు ఆరోపణ చేసినట్లు విచారణ మహిళ అంగీకరించింది. సరైయ్యాకు చెందిన కదీర్ ట్రాలీ దొంగతనం జరిగిందని, అతను తన భర్త దొంగిలించాడని అనుమానించి వేధించడం ప్రారంభించారని, దాంతో అతనిపైనా అతని అనుచరులపైనా కక్ష తీర్చుకోవడానికి తాను ఆ ఫిర్యాదు ఇచ్చానని వివరించింది.












Click it and Unblock the Notifications