బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాడిదలకు సన్మానం చేసిన మాజీ ఎమ్యెల్యే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా వినూత్నంగా ఉంటుంది. ఆయన్ని కన్నడిగులు ముద్దుగా వాటాళ్ నాగరాజ్ అని పిలుచుకుంటారు. కర్ణాటక ప్రభుత్వం పట్ల ఈయన నిరసన తెలిపే విధానం ప్రత్యేకంగా, వినూత్నంగా ఉంటుంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

Vatal Nagaraj felicitates donkeys at Rajyotsava in Bengaluru

ఎంతో కాలంగా కష్టించి పనిచేస్తూ, యజమాని విశ్వాసం చూరగొన్న రెండు గాడిదలను మంగళవారం ఘనంగా సత్కరించాడు. బెంగుళూరులోని కెంపెగౌడ బస్టాండ్‌లో ప్రయాణికులంతా చూస్తుండగా వాటల్ నాగరాజ్ పూల దండలు వేసి, శాలువాలు కప్పి 'రాజ్యోత్సవ' అవార్డును ఇచ్చారు.

ప్రజలకు సేవలందిస్తున్న ఆవులు, కుక్కలు తదితరాలను ప్రతినెల ఇలానే సత్కరిస్తామని చెప్పారు. కర్ణాటకలో వాటాళ్ నాగరాజ్ 'కన్నడ చాలువలి వతల్ పక్ష' పార్టీని స్ధాపించారు. ప్రస్తుతం ఆయనే పార్టీకి అధ్యక్షుడిగా వ్వవహారిస్తున్నాడు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం కూడా ఉంది.

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 1న రాష్ట్ర ప్రముఖులకు 'రాజ్యోత్సవ' పేరిట అవార్డులను అందిస్తోన్న విషయం తెలిసిందే. కన్నడిగులు 'కర్ణాటక రాజ్యోత్సవ'ను పెద్ద పండుగలా జరుపుకుంటారు.

English summary
Vatal Nagaraj felicitates donkeys at Rajyotsava in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X