Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన లింగాయత్ ఓటర్లు..!!

బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు.. తమ ప్రచార ఉధృతిని పెంచాయి. విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. సోమవారం సాయంత్రం నాటికి ఎన్నికల ప్రచారానికి తెర పడబోతోంది.

దీనితో- భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) నాయకులు ప్రచార జోరును పెంచారు. జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకలో మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతోన్నారు. శనివారంలో బెంగళూరులో ప్రధాని మోదీ 26 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు.

 veerashaivalingayat

ఇవ్వాళ కూడా బెంగళూరులో ఆయన రోడ్ షో కొనసాగుతోంది. ఈ ఉదయం తిప్పసంద్రలో మోదీ రోడ్ షో ఆరంభమైంది. అటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీీసీ అధినేత మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. జేడీఎస్ చీఫ్ ప్యాట్రన్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు.

ఈ పరిణామాల మధ్య కర్ణాటకలో మెజారిటీ సంఖ్యలో ఉన్న వీరశైవ లింగాయత్ వేదిక ప్రతినిధులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. వీరశైవ లింగాయతులు అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10వ తేదీన జరిగే పోలింగ్ సందర్భంగా లింగాయతులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు.

 veerashaivalingayat

తాము అధికారంలోకి వస్తే- రాష్ట్రంలో బజరంగ్ దళ్ సంస్థ కార్యకలాపాలను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అనంతరం కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని బీజేపీ నాయకులు రాజకీయంగా వాడుకుంటోన్నారు. ప్రధాని మోదీ మొదలుకుని అన్ని స్థాయిల్లో ఉన్న బీజేపీ నాయకులు బజరంగ్ దళ్ నిషేధాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తోన్నారు.

అలాంటి పరిస్థితుల్లో కర్ణాటక వీరశైవ లింగాయత్ వేదిక చేసిన తాజా ప్రకటన కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగించేదే. కర్ణాటక జనాభాలో 17 శాతం వరకు ఉన్న లింగాయత్ ఓటుబ్యాంక్‌కు నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేపే సామర్థ్యం ఉంది. అన్ని పార్టీలు కూడా లింగాయత్‌, వక్కలిగల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తుంటాయి. ప్రస్తుత అసెంబ్లీలో 54 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉండటమే దీనికి నిదర్శనం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+