• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూరగాయల వ్యాపారులు తస్మాత్ జాగ్రత్త ... మొన్న యూపీలో .. ఇప్పుడు రాజస్థాన్ లో వారికి కరోనా

|

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది . ఇప్పటికే దేశ వ్యాప్తంగా 56,383 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా , 1,889 మరణాలు సంభవించాయి. ఇక వారు, వీరు , చిన్న , పెద్ద అన్న తేడా లేకుండా కరోనా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఇక ఈ నేపధ్యంలో కరోనా కట్టడికి ప్రయత్నం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి ప్రజలను సామాజిక దూరం పాటించాలని,మాస్కులు, గ్లౌజ్ లు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాయి. అయితే పెడచెవిన పెడుతున్న చాలా మంది కరోనా బారిన పడటమే కాక మరికొంత మందికి వ్యాధిని వ్యాపింపజేస్తున్నారు. ఇక ఆ కోవలో ముఖ్యంగా కూరగాయల వ్యాపారులు చేరారు.

గ్యాస్ లీకేజ్ కు యాజమాన్య నిర్లక్ష్యమే కారణం.. ఎఫ్ఐఆర్ నమోదు .. విచారణ దిశగా ఏపీ సర్కార్

  COVID-19 : Vegetable Vendors Tests Positive In Uttar Pradesh
   కూరగాయల వ్యాపారులకు కరోనా టెర్రర్

  కూరగాయల వ్యాపారులకు కరోనా టెర్రర్

  నిత్యావసరాలు, కూరగాయలు వంటి వాటికి కరోనా లాక్ డౌన్ నుండి మినహాయింపు ఇచ్చారు. ఇక్కడ కరోనా వ్యాప్తి చెందకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుని విక్రయాలు జరపాల్సిన కూరగాయల వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోక పోవటం పెద్ద తలనొప్పిగా మారుతుంది. వాళ్ళు కరోనా పాజిటివ్ లు గా మారటమే కాకుండా, తమ వద్ద కూరగాయలు కొనేవారిని , తమ కుటుంబ సభ్యులను కూడా కరోనా పాజిటివ్ లుగా మారుస్తున్నారు.

   మొన్న యూపీలో ... నేడు జైపూర్ లో కూరగాయల విక్రేతలకు కరోనా

  మొన్న యూపీలో ... నేడు జైపూర్ లో కూరగాయల విక్రేతలకు కరోనా

  ఇక ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో 24, ఆగ్రాలో 28, లక్నోలో నలుగురు కూరగాయల వ్యాపారులు కరోనా బారిన పడ్డారు . ఇప్పుడు తాజాగా రాజస్థాన్ లో సైతం కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది . జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూరగాయలు అమ్మే 13 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇక వీరు ఎవరెవరికి కూరగాయలు అమ్మారు. వీరితో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారు అనే విషయాలను తెలుసుకుంటున్న అధికారులు వారందరినీ క్వారంటైన్ కు తరలించే పనిలో పడ్డారు.

  తెలుగు రాష్ట్రాల్లోనూ జాగ్రత్తలు పాటించని కూరగాయల వ్యాపారులు

  తెలుగు రాష్ట్రాల్లోనూ జాగ్రత్తలు పాటించని కూరగాయల వ్యాపారులు

  ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా కూరగాయల దుకాణాల వద్ద ఈగల్లా సామాజిక దూరం పాటించకుండా కూరగాయల కోసం జనం గుమి కూడుతున్నారు . ఇక ఈ సమయంలో కూరగాయల వ్యాపారులు చేతులకు గ్లౌజ్ లు లేకుండా కూరగాయల విక్రయాలు జరుపుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదేపదే చెప్తున్నా కూరగాయల వ్యాపారులు మాత్రం ఏం మారటం లేదు . ఇక వివిధ రాష్ట్రాలలో కూరగాయల వ్యాపారులకు కరోనా పాజిటివ్ వస్తున్న నేపధ్యంలో ఇక ఈ పరిణామాలతో అయినా కూరగాయల వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

  జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు .. కూరగాయల వ్యాపారులు తస్మాత్ జాగ్రత్త !!

  జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతులు .. కూరగాయల వ్యాపారులు తస్మాత్ జాగ్రత్త !!

  ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌస్ లు తప్పని సరిగా వినియోగిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూరగాయల విక్రయాలు జరపాల్సిన పరిస్థితి. అలా కాదు నాకేం కాదని ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తే వారు ఒక్కరు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు , వారి వద్ద నుండి కూరగాయలు కొనుగోలు చేసిన వారు సైతం తీవ్రంగా బాధ పడాల్సి వస్తుంది. అందుకే కూరగాయల వ్యాపారులు తస్మాత్ జాగ్రత్త . కరోనా మహమ్మారి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటే దేశానికే మేలు చేసిన వారవుతారు.

  English summary
  Recently, vegetable traders were hit by Corona in Uttar Pradesh's Meerut, 24 in Agra and 28 in Lucknow 4. Now the latest news that vegetable vendors in Rajasthan have been confirmed as corona positive. The government has been alerted to 13 people who sell vegetables under the Jaipur Municipal Corpora positive.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X