రన్ వే పైకి వాహనం, గుర్తించిన పైలట్లు: టేకాఫ్ అవుతున్న విమానం ఎమర్జెన్సీ బ్రేక్
హైదరాబాద్: ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణీకులతో వెళ్తున్న విమానం అత్యవసరంగా రన్ వే పైన ఆగిపోయింది. విమానం టేకాఫ్ అవుతుండగా ఓ వాహనం ఆ విమానం ముందుకు వచ్చింది. దీనిని గుర్తించిన పైలట్లు విమానాన్ని వెంటనే నిలిపేశారు.
ఇండిగో ఎయిర్ బస్ ఏ320 టేకాఫ్ అవుతుండగా రన్ వే పైన ఓ వాహనాన్ని అందులోని ఇద్దరు పైలట్లు గుర్తించారు. దీంతో ఆ వాహనం ప్రమాదం నుంచి తప్పించేందుకు ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించారు.

ఈ సంఘటన మంగళవారం ఉదయం హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో జరిగింది. ఇండిగో విమానం ప్రతి రోజు హైదరాబాద్ నుంచి గోవాకు ట్రిప్పులు నడుపుతుంది. దీనిపై విచారణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications