టీ బిల్లుకు రాజ్యసభలో మెలిక: సుష్మా వర్సెస్ వెంకయ్య
న్యూఢిల్లీ: సవరణల పేరుతో తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ మెలిక పెడుతున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందుతుందా, లేదా అనే ఉత్కంఠ చోటు చేసుకుంది. తాను ఒక ప్రాంత నేతను కానని బుధవారం ఉదయం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సీమాంధ్ర కూడా భారత్‌లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
బిజెపి చేసిన ప్రతిపాదనల్లో పలు అంశాలను చేర్చకుండా బిల్లును లోక్‌సభలో ఆమోదించడానికి ఎందుకు అంగీకరించారని లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్‌ను ఆయన ప్రశ్నించారు. కేవలం ఒకే ప్రాంతానికి న్యాయం చేస్తున్నామన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడడం మంచిదికాదని హితవు పలికారు. అరుణ్ జైట్లీ కూడా వెంకయ్యకు మద్దతు పలికారు. వెంకయ్య చేసిన ప్రతిపాదనల్ని బిల్లులో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించాలని తెలిపారు.

ప్రస్తుత వాతావరణం చూస్తుంటే, తెలంగాణ బిల్లుపై బిజెపి రెండు వర్గాలు ఏర్పడినట్లు కనిపిస్తోంది. సుష్మా స్వరాజ్‌ను తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు కూడా తప్పు పడుతున్నారు. వైయస్ జగన్ కలిసిన తర్వాతనే సుష్మా స్వరాజ్ తన మనసు మార్చుకుని బేషరతుగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చారని సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. బిజెపిలోని అంతర్గత కుమ్ములాటల వల్లనే ఇలా జరిగి ఉంటుందనే అనుమానం కూడా వ్యక్తం చేశారు.
కాగా, వెంకయ్య నాయుడు చేసిన సవరణలు ఇలా ఉన్నాయి. సీమాంధ్రకు భారీగా రెవెన్యూ లోటు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్షణం రూ.10 వేల కోట్లను గ్రాంటుగా ప్రకటించాలి. పోలవరం ప్రాజెక్టు కింద ముంపు గ్రామాలన్నీ సీమాంధ్రలో కలపాలి. దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును చేపట్టాలి.
రాయలసీమ, ఉత్తర కోస్తాకు ప్రత్యేక కేటగిరీ కింద నిధులు కేటాయించాలి. అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రాజెక్టులు, ఉన్నత సంస్థలకు కూడా కేటాయింపులు స్పష్టీకరించాలి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పదేళ్ల పాటు గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. ఈ సవరణలను వెంకయ్య నాయుడు ప్రతిపాదిస్తున్నారు. అయితే, బిల్లులో ఒక పదం మార్చినా తిరిగి లోకసభకు వెళ్లాల్సి ఉంటుంది.
అతి కష్టం మీద లోకసభలో బిల్లును ఆమోదింపజేసుకున్న యుపిఎ ప్రభుత్వం మళ్లీ వెనక్కి వెళ్లడానికి సిద్ధంగా లేదు. బిజెపి ప్రతిపాదిస్తున్న సవరణలను బిల్లులో పెట్టకుండా ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేస్తారని అధికార పక్ష నేతలు చెబుతున్నారు. ఇదే విషయంపై బిజెపికి, అధికార పక్షానికి మధ్య చర్చలు గురువారంనాడు కూడా కొనసాగుతున్నాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications