రాహుల్ గాంధీకి సభాహక్కుల నోటీసు: జీడీపీపై సెటైర్లు

Subscribe to Oneindia Telugu

న్యూడిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై శనివారం సభా హక్కుల నోటీసు జారీ అయ్యింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఆ నోటీసును పంపారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేరును వక్రీకరిస్తూ రాహుల్‌ ట్వీట్‌ చేయడంపై ఈ నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది.

బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ భూపిందర్‌ యాదవ్‌ రాహుల్‌ గాంధీపై ఈ నోటీసు ఇచ్చారు. ప్రధాని మోడీ, అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియోను ట్వీట్ చేస్తూ.. అందులో jaitleyకి బదులు jaitlie(అబద్ధాలకోరు అర్థం వచ్చేలా)గా పేర్కొన్నారన్నారు. ఇలా చేయడం ఆయనను అవమాన పరచడమేనంటూ యాదవ్‌ ఈ నోటీసు ఇచ్చారు.

రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యుడైనందు వల్ల ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు నోటీసును రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు లోక్‌సభ స్పీకర్‌కు పంపారు. కాగా బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ నేతృత్వంలోని ఎథిక్స్‌ కమిటీ వద్ద ఇప్పటికే రాహుల్‌కు సంబంధించిన ఒక ఫిర్యాదు పెండింగ్‌లో ఉంది.

 Venkaiah Naidu Sends Privilege Notice Against Rahul Gandhi To Lok Sabha Speaker

జీడీపీపై రాహుల్ సెటైర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధికమంత్రి అరుణ జైట్లీలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా భారత ఆర్ధిక రంగం కుదేలైందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం దృష్టిలో జీడీపీ అంటే స్థూల ఆర్ధిక వృద్ధి కాదనీ... 'స్థూల విభజన రాజకీయాలు' అని వ్యాఖ్యానించారు. ఇవాళ రాహుల్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ...

'ప్రధాని మోదీతో కలిసి ఆర్ధికమంత్రి జైట్లీ మేథస్సు రంగరించి సాధించిన స్థూల విభజన రాజకీయాల (జీడీపి)తో భారత్‌కు వచ్చింది ఇదీ...
నూతన పెట్టుబడులు : 13 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి.
బ్యాంకు పరపతి పెరుగుదల : 63 ఏళ్ల కనిష్టానికి దిగజారింది.
ఉద్యోగ కల్పన : 8 ఏళ్ల దిగువకు పడిపోయింది..
వ్యవసాయ జీవీఏ (స్థూల విలువ) వృద్ధి : 1.7 శాతం క్షీణించింది..
ద్రవ్యలోటు : 8 ఏళ్ల గరిష్టానికి పెరిగింది...
నిలిచిపోయిన ప్రాజెక్టులు : పైపైకి...' అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajya Sabha Chairman M Venkaiah Naidu today sent a privilege notice against Rahul Gandhi to Lok Sabha Speaker Sumitra Mahajan for further action, holding that "prima facie there is an issue of privilege", sources said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి