యువకుడ్ని కాటేసిన 5 నిమిషాలకే చనిపోయిన విషపూరిత పాము.. బాధితుడు సేఫ్.. తల పట్టుకుంటున్న వైద్యులు?
సాధారణంగా పాము కాటుకు మనిషి చనిపోతాడు. కానీ ఓ విషపూరిత పాము.. ఓ యువకుడ్ని కాటేసిన ఐదు నిమిషాలకే మృతి చెందింది. బాధితుడు మాత్రం సేఫ్ గా ఉన్నాడు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం దేశంలో ట్రెండింగ్ లో ఉన్న ఈ వార్త గురించి మీరూ తెలుసుకోండి.
ఈ ఘటనను ప్రస్తుతం రే రెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా అభివర్ణిస్తున్నారు వైద్యులు. ఓ యువకుడ్ని కాటేసిన విషపూరితమైన పాము.. ఐదు నిమిషాలకే చనిపోయింది. బాధితుడికి మాత్రం ఏమీ కాలేదు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని భాలాఘాట్ జిల్లాలో జరిగింది. యువకుడ్ని కాటేసిన పాము.. ఐదు నిమిషాలకే మృతి చెందడంతో ఇదో అరుదైన ఘటనగా వైద్యులు అభివర్ణిస్తున్నారు.
భాలాఘాట్ జిల్లాలోని ఖుడ్ సోడీ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. సచిన్ నాగ్ పురే(25) అనే కారు మెకానిక్ ఇటీవల ఉదయం 7 గంటల సమయంలో తన పొలానికి వెళ్లాడు. ఆ క్రమంలో ఓ విషపూరితమైన పాముపై అనుకోకుండా కాలు వేశాడు. దీంతో ఆ పాము అతడ్ని కరిచింది. అయితే ఆ యువకుడ్ని కరిచిన ఐదు నిమిషాలకే పాము మృతి చెందింది. బాధితుడికి మాత్రం ఏమీ కాలేదు. దీంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.
అయితే ఇదే విషయంపై సచిన్ మాట్లాడుతూ.. తాను గత 7-8 ఏళ్లుగా ఆయుర్వేద వన మూలికలతో పళ్లు తోముకుంటున్నానని అందుకే తన రక్తం విషాన్ని తీసుకోకుండా ఉందని.. పాము మరణించిందని చెప్పుకొచ్చాడు. మరో వైపు ఇదే ఘటనపై ఫారెస్ట్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనను అరుదైన సందర్భంగా అభివర్ణించారు.

పాము ఆ యువకుడ్ని కాటేసే సమయంలో వేగంగా కాటు వేయడం కారణంగా పాము కోరలకు ఏమైనా దెబ్బ తగిలి మృతి చెంది ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications