21 రాష్ట్రాల్లో అధికారంలో బీజేపీ, దేశంలో లెఫ్ట్ రైట్ కాదు: త్రిపుర గెలుపుపై అమిత్ షా
న్యూఢిల్లీ: దేశ ప్రజలు మోడీ నేతృత్వంలోని బీజేపీ వెంట ఉన్నారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
త్రిపుర, నాగాలాండ్‌లతో కలిపి బీజేపీ దేశంలోనే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓటింగ్ శాతం బాగా పెరిగిందని చెప్పారు. వచ్చే ఎన్నికల ఫలితాలకు ఇవి మార్గదర్శనం కానున్నాయని చెప్పారు.

రానున్న ఫలితాలకు ఇవి దిక్సూచి కానున్నాయని చెప్పారు. మేఘాలయలో తమకు మెజార్టీ రాకున్నా ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. కర్నాటకలో భారీ మెజార్టీ లక్ష్యంగా రంగంలోకి దిగుతామని చెప్పారు.
లెఫ్ట్ దేశంలో రైట్ కాదన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడమే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు. త్రిపుర ఓటర్లు మార్పుకు పట్టం కట్టారని తెలిపారు. త్రిపురలో గెలుపు చారిత్రాత్మకం అన్నారు. ఈశాన్య ప్రాంతంలో తమ ప్రభుత్వ పాలసీకి ఈ గెలుపు నిదర్శనం అన్నారు.
త్రిపురలో బీజేపీకి ఒంటరిగా ఎక్కువ సీట్లు వచ్చినా మిత్ర ధర్మం పాటిస్తామని చెప్పారు. బీజేపీని గెలిపించిన ఈశాన్య రాష్ట్ర ప్రజలకు అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. ఒడిసా, పశ్చిమ బెంగాల్, కేరళలో గెలుపు తర్వాత బీజేపీ గోల్డెన్ పీరియడ్ ప్రారంభం అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications