బ్లాక్ లో 14 కేజీలు బంగారం కొనుకున్న వర్మ, స్కామ్ డబ్బుతో హైదరాబాద్ లో?
వాల్మీకి కార్పొరేషన్ నుంచి దోచుకున్న కోట్లాది రూపాయల సొమ్ములో హైదరాబాద్ గ్యాంగ్ మాస్టర్ మైండ్ సత్యన్నారాయణ వర్మ రూ. 10 కోట్లు విలువైన 14 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసిన విషయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్ (సిట్) విచారణలో వెలుగులోకి వచ్చింది. అలాగే వాల్మీకి కార్పొరేషన్ సొమ్ముతో హైదరాబాద్‌లోని 4 బార్లకు తరలించిన రూ. 4 లక్షలను సీజ్ చేయడంలో సిట్ అధికారులు విజయం సాధించారు.
వర్మ కొనుగోలు చేసిన 14 కేజీల బంగారం కోసం సిట్ అన్వేషణ కొనసాగిస్తోంది. కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ స్కామ్ సొమ్ముతో హైదరాబాద్ లో వర్మ కిలో బరువున్న 14 బంగారు కడ్డీలను కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. అయితే బంగారం రికవరీ చేయడం సిట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. నిందితుడు వర్మ తాను కొనుగోలు చేసిన బంగారాన్ని ఎక్కడ ఉంచాడన్న అసలు విషయం బయటపెట్టలేదని సిట్ అధికారులు చెబుతున్నారు.

వాల్మీకి కార్పొరేషన్ నుంచి హైదరాబాద్ ఫస్ట్ ఫైనాన్స్ కో ఆపరేటివ్ సొసైటీకి అక్రమంగా రూ. 89 కోట్లు బదిలి అయ్యిందని సిట్, ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ అక్రమ నగదు బదిలీలో కీలక పాత్రధారి అయిన వర్మను సిట్ అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ విచారణలో బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయగా బంగారం కొనుగోలుకు సంబంధించిన పత్రాలు లభించాయని ప్రముఖ వార్తా సంస్థ కన్నడ ప్రభ వర్గాలు తెలిపాయి.
ప్రముఖ నగల వ్యాపారుల నుంచి 6 కిలోల బంగారం కొనుగోలు చేశారని వెలుగు చూసింది: వాల్మీకి కార్పొరేషన్ కు చెందిన బెంగళూరులోని ఎంజీ రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఖాతా నుండి హైదరాబాద్ ఫస్ట్ ఫైనాన్స్ కో ఆపరేటివ్ సొసైటీకి చెందిన 18 నకిలీ ఖాతాలకు డబ్బు బదిలీ చేయబడింది. ఈ డబ్బుతో హైదరాబాద్‌లోని ప్రముఖ నగల వ్యాపారి నుంచి 6 కిలోల బంగారాన్ని కొనుగోలు చేశారు. మిగిలిన 8 కిలోల బంగారాన్ని బ్లాక్ మార్కెట్ లో ఇతర నగల వ్యాపారుల నుంచి కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

బంగారం అమ్మేందుకు అంగీకరించిన వ్యాపారులకు ఇప్పుడు సినిమా కష్టాలు మొదలైనాయి. బంగారం కొనుగోలు వ్యవహారంలో వ్యాపారులను కూడా సిట్ అధికారులు విచారించారు. కానీ చట్టం ప్రకారం బంగారం అమ్మిన, బంగారం కొనుగోలుకు సంబంధించిన లెక్కలు సిట్ కు చెప్పినట్లు సమాచారం. కేవలం బ్యాంకింగ్ ద్వారా డబ్బులు అందిన తర్వాత కిలో బరువున్న 6 బంగారు కడ్డీలను వర్మకి విక్రయించినట్లు హైదరాబాద్ జ్యువెలర్స్ యజమాని అంగీకరించాడు. ఇప్పుడు అతని వద్ద బంగారం కోసం కొనుగోలు చేసిన సొమ్మును వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలైయ్యిందని సిట్ అధికారులు అంటున్నారు.
బ్లాక్ మార్కెట్ లో బంగారం విక్రయించిన ముగ్గురు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగారం గురించి అసలు విషయం వర్మ బయటపెట్టలేదని తెలిసింది. వాల్మీకి కార్పొరేషన్ లో దోచుకున్న డబ్బుతో కొన్న బంగారంపై విచారణలో వర్మ ఏమీ వెల్లడించలేదు. దీంతో పాటు అతని సహచరుడు జగదీష్ నుంచి కొనుగోలు చేసిన 47 గ్రాములు, చంద్రమోహన్ నుంచి 264 గ్రాములు నగలతో పాటు వాల్మీకి కార్పొరేషన్ సొమ్మును విడివిడిగా స్వాధీనం చేసుకున్నారు.వర్మ నోరువిప్పితే రూ.10 కోట్ల విలువైన నగలు వెనక్కి వస్తాయని సిట్ అధికారులు చెబుతున్నారు.
కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్‌లో దోచుకున్న రూ. 54 లక్షలు నగదు బార్లులో ఖర్చు చేశారని సిట్ విచారణలో తేలింది. ఈ సొమ్మును బార్ల యజమానుల నుంచి జప్తు చేయడంలో కూడా సిట్ విజయం సాధించింది. అక్రమ మనీలాండరింగ్ విచారణలో హైదరాబాద్‌లోని నాలుగు బార్‌లకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, రూ. 10 లక్షలు బదిలీ చేశారు. ఈ డబ్బు కోసం బార్ యజమానులు 5% కమీషన్ పొందారు. చివరకు బార్ యజమాలను గుర్తించి విచారించగా వాళ్లు డబ్బును తిరిగి ఇచ్చారని సిట్ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications