నర్సులపై జయ జోకులు వేస్తూ ఉల్లాసంగా గడిపారు, చివరి రోజుల్లో భావోద్వేగానికి గురయ్యాం

ఆసుపత్రిలో ఉన్న కాలంలో ఆమెకు ట్రీట్ మెంట్ చేసే వైద్యులు, నర్సులతో జయలలిత సరదాగా ఉండేవారని ఆపోలో ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ వైస్ చెర్ పర్సన్ డాక్టర్ ప్రీతా రెడ్డి చెప్పారు.

చెన్నై :పేదలకు ఆమె అమ్మ, ప్రత్యర్థులకు మాత్రం ఆమె కఠినాత్మురాలు, అయితే ఆసుపత్రిలో ఉన్న చివరి రోజుల్లో ఆమె జోకులేసేవారని ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి. ఐసియూలో తనకు వైద్య సేవలు అందించేందుకు వచ్చే వైద్య సిబ్బందితో ఆమె జోకులు వేస్తూ ఉల్లాసంగా గడిపారని ఆసుపత్రివర్గాలు తెలిపాయి.

ఆపోలో ఆసుపత్రిలో జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో నర్సులతో వైద్య సిబ్బంది చాల సరదాగా ఉన్నారని ఆసుపత్రివర్గాలు చెప్పాయి. ఆమెకు సెన్సాఫ్ హ్యుమర్ ఎక్కువని ఆపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ ప్రీతా రెడ్డి చెప్పారు.జయ ఆసుపత్రిలో ఉన్న కాలంలో డాక్టర్ ప్రీతా రెడ్డి ఆమెతో సన్నిహితంగా ఉన్నారు.

ఎప్పుడూ గంభీరంగా కన్పించే జయను చూస్తే ఎదుటివారిలో భయం కన్పిస్తోంది. కాని ఆమె చిన్నపిల్లల మనస్తతత్వం కలిగి ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఐసియూలో ఉన్న సమయంలో ఆమె చికిత్సకు సహకరించే సమయంలో సమయానికి అనుకూలంగా ఆమె జోకులు పేల్చేవారని ఆసుపత్రివర్గాలు చెప్పాయి.

very emotion who treated to jayalalita in apollo hospital

20 ఏళ్ళుగా డాక్టర్ ప్రీతా రెడ్డితో జయలలితకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె ఏది చేయాలని నిర్ణయం తీసుకొంటే అదే చేసేవారని ప్రీతా రెడ్డి గుర్తుకు చేసుకొన్నారు.ఆమెను బతికించేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్నారు ఆమె . ఆమె చావుకు దగ్గరయ్యారని తెలిసిన తర్వాత ఆమెతో ఆసుపత్రిలో సన్నిహితంగా ఉన్న నర్సులు బావోద్వేగానికి గురయ్యారని ఆమె వివరించారు.

చివరి 48 గంటల పాటు ఆమె ప్రాణాలను నిలిపేందుకు శక్తివంచనలేకుండా కృషి చేశామని ఆమె గుర్తుచేసుకొన్నారు. ఈ ప్రయత్నం వల్ల నైనా జయ బతికితే బాగుండేదన్నారు ఆమె.ఆమె మృత్యుముఖంలోకి అడుగుపెడుతున్నారనే విషయం తెలిసి ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారని ఆమె గుర్తుచేసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+