సిద్ధరామయ్యతో విభేదాలు!: కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎస్ఎం కృష్ణ
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ పార్టీకి రాజీనామా చేశారు.
హైదరాబాద్: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఏర్పడిన విభేదాలు ఏకంగా ఆయనను పార్టీకి రాజీనామా చేసేలా పురికొల్పారని తెలుస్తోంది. ఆయన తీరుతో అసంతృప్తితో ఉన్నారు.
తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. 84 ఏళ్ల కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2004-2008 వరకు మహారాష్ట్ర గవర్నర్‌గా, మన్మోహన్ హయాంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

బుజ్జగింపులు
ఎస్ఎం కృష్ణ రాజీనామా నేపథ్యంలో ఆయనను అధిష్టానం బుజ్జగిస్తోంది. బెంగళూరు వెళ్లి ఆయనతో మాట్లాడుతానని, ఆయన ఆకస్మిక నిర్ణయానికి కారణం ఏమిటో తెలుసుకుంటానని, ఆయన సహేతుకంగా నిర్ణయాలు తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత ధరమ్ సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications