ఉరివేసుకుని మాజీ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య
అగర్తలా: సిపిఎం సీనియర్ నాయకుడు, త్రిపుర మాజీ డిప్యూటీ స్పీకర్ సునీల్‌కుమార్ చౌదరి(86) ఆత్మహత్య చేసుకున్నారు. సబ్రూమ్‌పట్టణంలోని తన స్వగృహంలో ఉన్న చెట్టుకు చౌదరి ఉరేసుకుని చనిపోయినట్లు సోమవారం గుర్తించారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సునీల్ కుమార్ చౌదరి గత ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా, ఆయన రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తనకున్న ఆరోగ్య సమస్యలను తట్టుకోలేక తాను ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నానని చౌదరి లేఖలో రాశారని పోలీసులు తెలిపారు. కాగా, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను సోమవారం నిర్వహించింది.

పార్టీకి చౌదరి చేసిన సేవలు ఎప్పుడూ గుర్తిండిపోతాయని త్రిపుర సిపిఎం పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. అతనో మంచి నిర్వాహకుడని, సమాజంలో శాంతి సామరస్యాలను కాంక్షించే వ్యక్తని కొనియాడింది.
1953నుంచి సిపిఐలో పని చేస్తున్న సునీల్ కుమార్ చౌదరి.. పార్టీ విభజన తర్వాత 1964లో సిపిఎంలో చేరారు. ఆయనకు భార్య, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.












Click it and Unblock the Notifications