ట్వీట్ దుమారం: కేఎఫ్‌సీ, కియా, హ్యుండాయ్ షోరూం ఎదుట వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నిరసన
సోషల్ మీడియా పోస్టులతో కేఎఫ్‌సీ, కియా, హ్యుండాయ్‌కి సెగ తగలింది. గుజరాత్‌లో ఏకంగా వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయా కంపెనీ షోరూం ఎదుట నిరసనలకు దిగారు. కశ్మీర్‌కు సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. కేఎఫ్‌సీ పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. దీంతో అతివాద గ్రూపులు ఆందోళనకు దిగాయి. ఆయా షోరూం/ రెస్టారెంట్ల ఎదుట జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సదరు కామెంట్లపై క్షమాపణ చెప్పాలని భజరంగ దళ్ డిమాండ్ చేసింది. లేదంటే తమ నిరసనలు ఆగవని స్పష్టంచేసింది.
పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆ సంస్థ.. కశ్మీర్‌కు సంఘీభావం తెలపడమే ఇందుకు కారణం. పాకిస్థాన్ 'కశ్మీర్ డే'ను జరుపుకునే ఫిబ్రవరి 5న ఇందుకు సంబంధించిన పోస్టు ఫేస్‌బుక్‌లో షేర్ అయింది. వైరల్ కావడంతో భారతీయ నెటిజన్లు కేఎఫ్‌సీపై మండిపడ్డారు. పాక్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ట్వీట్‌ను ఆ తర్వాత డిలీట్ చేసినప్పటికీ దాని స్క్రీన్ షాట్లను తీసి, వైరల్ చేశారు.

మా గురించిన ఆలోచనలను ఎప్పుడూ మర్చిపోలేరు.. భవిష్యత్తులో మీకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాం అని దానికి క్యాప్షన్ తగిలించింది. కశ్మీర్ కశ్మీరీలకే చెందుతుందని ఫొటోపై రాసుకొచ్చింది. దీనిని తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆ సంస్థ క్షమాపణలు చెప్పినా నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు.
Recommended Video
దేశం వెలుపల కేఎఫ్‌సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టుపై క్షమాపణలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. భారత్‌ను తాము గౌరవిస్తామని చెప్పుకొచ్చింది. భారతీయులందరికీ నిబద్ధతతో సగర్వంగా సేవలు అందిస్తామని వివరించింది. దేశం వెలుపల ఉన్న కొన్ని కేఎఫ్‌సీ సోషల్ మీడియా ఛానెల్‌లలో ప్రచురించిన పోస్ట్‌కు మేము క్షమాపణలు కోరుతున్నాం... మేము భారతదేశాన్ని గౌరవిస్తాం.. భారతీయులందరికీ సగర్వంగా సేవ చేయాలనే నిబద్ధతకు కట్టుబడి ఉంటాం అని తెలిపింది.












Click it and Unblock the Notifications