వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళపై రేప్‌: ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు రూ. 31 వేలు పరిహారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పాట్నా: కేంద్రం మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు నిర్భయ చట్టం తీసుకొచ్చినా వారిపై అన్యాయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బీహార్‌లో జరిగిన సంఘటనే ఇందుకు తాజా ఉదారహరణ.

అత్యాచారానికి గురైన మహిళ తాను అత్యాచారానిగురైన విషయాన్ని ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు పంచాయితీ పెద్దలు విలువ కట్టారు. ఈ సంఘటన బీహార్‌లోని నవాడ జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే... నవాడ జిల్లాకు 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న గ్రామంలో ఓ వ్యక్తి బాధితురాలిని కిడ్నాప్ చేసి రెండు రోజుల పాట అత్యాచారం చేశాడు. ఈ అత్యాచార విషయం పంచాయితీ దృష్టికి రావడంతో ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయరాదని బాధితురాలి కుటుంబ సభ్యులకు షరతు పెట్టి రూ. 31 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పారు.

Victim offered Rs.31,000 to forget rape

అత్యాచారం చేసిన వ్యక్తి కుటుంబానికి గ్రామంలో పలుకుబడి ఉండటంతో ఈ మొత్తాన్ని చెల్లించేందుకు నిరాకరించాడు. ఈ విషయం బయటకు చెబితే అంతు చూస్తానని బాధితురాలిని బెదిరించాడు.

తొలుత బాధితురాలా పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. స్ధానికంగా ఉన్న మీడియా జోక్యం చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.

బీహార్‌లో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణం. గతంలో కూడా బీహార్‌లోని కటియా జిల్లాలో ఇలాంటి ఘటనలు రెండు వెలుగు చూశాయి.

English summary
A panchayat in Bihar has ordered one of its members accused of raping a woman to pay her Rs.31,000 and asked the victim to forget the incident, police said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X