వరల్డ్ కప్ స్టార్లతో ప్రధాని మోడీ భేటీ..! ట్రోలింగ్ సహా ఆసక్తికర చర్చలు..!
ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు.. ఇవాళ ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసానికి మహిళల ప్రపంచ కప్ ఆడిన క్రికెటర్లు వెళ్లారు. వరల్డ్ కప్ టైటిల్ విజయంపై ప్రధాని మోడీ క్రికెటర్లను అభినందించారు. అదే సమయంలో వరుసగా మూడు పరాజయాలు, సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ తర్వాత టోర్నమెంట్‌లో వారి అద్భుతమైన పునరాగమనాన్ని ప్రశంసించారు. దీంతో క్రికెటర్లు కూడా తాము ఎదుర్కొన్న పరిస్ధితుల్ని ప్రధానితో పంచుకున్నారు.
మరోవైపు మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2017లో ప్రధానమంత్రిని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో తాము ట్రోఫీ లేకుండానే కలిసినట్లు గుర్తుచేసుకుంది. ఇప్పుడు తాము ట్రోఫీతో ప్రధాని మోడీని కలిసినందుకు సంతోషంగా ఉందన్నారు. కాబట్టి తాము తరచుగా ప్రధానిని కలవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అప్పట్లో ప్రధాని మోడీ తమకు స్పూర్తినిచ్చేలా మాట్లాడారని ఓపెనర్ స్మృతీ మంథాన గుర్తుచేసుకున్నారు.

దీప్తి శర్మను చూసిన ప్రధాని మోడీ..ఆమె చేతిపై హనుమంతుడి పచ్చబొట్టు గురించి అడిగారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ బయోలో "జై శ్రీ రామ్" అని రాసిన దాని గురించి చర్చించారు. అది తనకు బలాన్ని ఇస్తుందని దీప్తి తెలిపింది. ప్రపంచ కప్ విజేత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రధాని మోదీని మీరు ఎల్లప్పుడూ వర్తమానంలో ఎలా ఉండగలుగుతున్నారని అడిగారు. దీనికి ప్రధాని మోదీ ఇప్పుడు అది తనకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రపంచ కప్ ఫైనల్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్‌తో ముగించడంపై ప్రధాని స్పందిస్తూ.. ఆ క్యాచ్ పట్టిన వెంటనే, భారత కెప్టెన్ బంతిని తన జేబులో పెట్టుకుందని, బంతి తన వద్దకు రావడం తన అదృష్టమని, ఆమె దానిని తన వద్దే ఉంచుకుందని అన్నారు.

అలాగే అమన్‌జోత్ కౌర్ దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ క్యాచ్‌ను డీప్ మిడ్-వికెట్‌లో తడబడి పట్టుకోవడంపై ప్రధాని స్పందిస్తూ.. ఆ క్యాచ్ దాదాపుగా భారత్‌కు ఆటను ఖరారు చేసిందన్నారు. క్యాచ్ పట్టుకునేటప్పుడు మీరు బంతిని చూడాలి, కానీ క్యాచ్ తర్వాత మీరు ట్రోఫీని చూడాలన్నారు. పేసర్ క్రాంతి గౌడ్ తన సోదరుడు ప్రధాని నరేంద్ర మోడీకి పెద్ద అభిమాని అని తెలిపింది. దీంతో ప్రధాని వెంటనే వారిని కలవమని ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు ఫిట్ ఇండియా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన క్రికెటర్లను కోరారు. వారి పాఠశాలలను సందర్శించి అక్కడి యువతుల్ని ప్రేరేపించాలని సూచించారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications