సభలో అఖిలేష్ భార్య తడబాటు, ఎంపీలు నవ్వితే బాధపడింది! (వీడియో)

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణి, సమాజ్‌వాది పార్టీ పార్లమెంటు సభ్యురాలు డింపుల్ యాదవ్ లోకసభలో చేసిన ఓ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.

డింపుల్ యాదవ్ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి. ఆమె కన్నౌజ్ నుంచి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె లోకసభలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియోలో చక్కెర్లు కొడుతోంది.

ఆ వీడియోలో ఆమె పలుమార్లు చేసిన బ్లండర్స్ ఉన్నాయి. అభివృద్ధి పైన ఆమె లోకసభలో మాట్లాడారు. మాట్లాడే సమయంలో ఆమె పలుమార్లు తడబడ్డారు. అంతేకాదు, హిందీ వ్యాఖ్యలను ఉచ్చరించడంలో కొంత ఇబ్బంది పడ్డారు.

Video: Dimple Yadav's hilarious speech in Lok Sabha goes viral

అంతేకాదు, తాను మాట్లాడుతుండగా కొందరు ఎంపీలు నవ్వారు. దానికి ఆమె మరింత ఇబ్బందికరంగా ఫీలయ్యారు. ఆమె నెర్వస్‌గా కనిపించారు. ఆమె స్పీచ్ పైన పలువురు ఎంపీలు వ్యంగ్యంగా నవ్వారని తెలుస్తోంది.

డింపుల్ యాదవ్ లోకసభలో ఒక నిమిషం పైన మాట్లాడారు. డింపుల్ యాదవ్ మాట్లాడుతుండగా తడబడటాన్ని చూసి రాజీవ్ ప్రతాప్ రూడీ నవ్వారని తెలుస్తోంది. డింపుల్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ సమస్యలు, మేకిన్ ఇండియా తదితరాలపై మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+