ఆపుకోలేక.. రోడ్డు మీదే పోసేసిన మంత్రి! వైరల్ గా మారిన వీడియో...
బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో నీటి సంరక్షణ శాఖ మంత్రి రామ్ షిండే.. బహిరంగ మూత్ర విసర్జన చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోలాపూర్ - బర్షి రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
ముంబై : ఒకవైపు దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ముందుకెళ్తుండగా మరోవైపు కొంతమంది బీజేపీ నేతలు అందుకు విరుద్ధంగా వెళుతున్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో నీటి సంరక్షణ శాఖ మంత్రి రామ్ షిండే.. బహిరంగ మూత్ర విసర్జన చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోలాపూర్ - బర్షి రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.

దీనిపై మీడియా మంత్రిని సంప్రదించగా.. గత నెల రోజుల నుంచి జల్‌యుక్త శివార్ స్కీమ్‌పై ప్రచారం కల్పించేందుకు తీరిక లేకుండా తిరుగుతున్నానని, ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాయనని మంత్రి చెప్పారు.
తీవ్ర జ్వరంతో ఉన్న తనకు రహదారిపై ఎక్కడా మూత్రశాల కనిపించకపోవడంతో.. ఆరోగ్య కారణాల దృష్ట్యా రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిందంటూ ఆయన వివరణ ఇచ్చారు. మరోవైపు మంత్రి రామ్ షిండే నిర్వాకంపై ప్రతిపక్ష పార్టీ ఎన్సీపీ విరుచుకుపడింది.
మంత్రి చర్యతో ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మక స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం పూర్తిస్థాయిలో విఫలమైందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలే నిబంధనలు ఉల్లంఘిస్తే.. ప్రజలు ఉల్లంఘించరా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రజలకు ఆదర్శంగా పాలకులు నిలిచినప్పుడే స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం అవుతుందన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ విఫలమైందనడానికి మంత్రి రామ్ షిండే చక్కటి ఉదాహరణ అని నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications