వీడియో: వారితో చర్చలకు పవన్‌కు మోడీ సూచన
అహ్మదాబాద్: బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో జనసేన చీఫ్, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్ శుక్రవారం సమావేశమయ్యారు. ఆయన దాదాపు 40 నిమిషాల పాటు మోడీతో చర్చలు జరిపారు. కలిసి పనిచేయాలని మోడీతో పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. మోడీకి మద్దతు తెలపడానికే తాము ఇంత దూరం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
రాష్ట్ర విభజన జరగవచ్చు గానీ ఇరు ప్రాంతాల ప్రజలు చీలిపోవడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు రాజు రవితేజ కూడా అహ్మదాబాద్ వచ్చారు. మరి కొంత మంది అనుచరులు కూడా పవన్ కళ్యాణ్‌తో పాటు వచ్చారు. పొత్తు ఖరారుపై, సీట్ల పంపకంపై తమ పార్టీ నేతలు ప్రకాష్ జవదేకర్, అరుణ్ జైట్లీతో మాట్లాడాలని మోడీ పవన్ కళ్యాణ్‌కు సూచించినట్లు సమాచారం.

తన అనుచరులను పవన్ కళ్యాణ్ మోడీకి పరిచయం చేశారు. ఆ తర్వాత మోడీ, పవన్ కళ్యాణ్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. మోడీతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోను చూడండి.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/PTQUB7s8nRc?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications