ప్రధాని మోడీ మైసూరు రోడ్‌షోలో భద్రతా వైఫల్యం: దూసుకొచ్చిన మొబైల్ ఫోన్ (వీడియో)

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఆదివారం నాడు ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న వాహనంపై మొబైల్ ఫోన్ విసిరివేయడంతో సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో సందర్భంగా మైసూరులోని కేఆర్ సర్కిల్ సమీపంలో భద్రతా ఉల్లంఘన కనిపించింది.

కర్ణాటక ఎన్నికలకు ముందు ఆదివారం జరిగిన ప్రధాని రోడ్‌షో సందర్భంగా మైసూరులో భారీ ఎత్తున జనం తరలివచ్చారు. గుంపులో స్థానికులు, పర్యాటకులు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుదారులు రోడ్డుకు ఇరువైపులా గుమిగూడి ప్రధానిపై పూల రేకులు కురిపించి ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలోనే ఓ దుండగుడు వాహనంపైకి సెల్‌ఫోన్ విసిరాడు.

PMs Mysuru Roadshow As Mobile Phone Lobbed At Modi

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో ప్రధాని మోడీ దగ్గరి వరకు వెళ్లి పక్కనపోయింది. ప్రధాని భద్రతా అధికారి మొబైల్ ఫోన్‌ను గమనించినట్లు అనిపించింది. కానీ, భద్రతా అధికారులు గమనించేలోపే.. ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న ఓపెన్-టాప్ వాహనం ముందు కొంతదూరంలో ఆ ఫోన్ పడిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ప్రధాని మోడీ ఈ సంఘటన పట్టించుకోకుండా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగడం గమనార్హం.

మైసూరు సంప్రదాయ 'పేట', కాషాయ కండువా ధరించిన ప్రధానితో పాటు మైసూరు ఎంపీ ప్రతాప్‌సింహ, మాజీ మంత్రులు కేఎస్‌ ఈశ్వరప్ప, ఎస్‌ఏ రామదాస్‌ కూడా ఉన్నారు. ఈశ్వరప్ప ఇటీవల ఎన్నికల రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే రామదాస్ న్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ నిరాకరించారు.

మొత్తం రోడ్‌షో సమయంలో, ప్రధాని మోడీకి బిజెపి జెండాలు, పూలదండలు, ప్రధాని పోస్టర్లు, కటౌట్‌లతో స్వాగతం పలికాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన స్త్రీ, పురుషుల సాంస్కృతిక బృందం కూడా రోడ్డు పొడవునా నడిచింది.

కాగా, గతంలో పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోడీకి సెక్యూరిటీ వైఫల్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిరసనకారుల దిగ్బంధనం కారణంగా ప్రధాని మోడీ కాన్వాయ్ వాహనాలు ఫ్లైఓవర్‌పై 20 నిమిషాల పాటు చిక్కుకుపోయినప్పుడు భద్రతను ఉల్లంఘించిన విషయాన్ని గుర్తుచేస్తుంది. పంజాబ్‌ ఎన్నికలకు ముందు ఆయన పర్యటనలో భద్రతా లోపం ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ ఘటనపై మాజీ డీజీపీ ఎస్ ఛటోపాధ్యాయతో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+