వీడియో: ఎన్నికల ముందు డబ్బులు పంచిన తేజస్వీ యాదవ్, జేడీయూ సెటైర్లు
పాట్నా: ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఎన్నికల వేళ వివాదంలో చిక్కుకున్నారు. పంచాయతీ ఎన్నికలకు ముందు ఓ గ్రామంలో మహిళలకు ఆయన డబ్బులు పంచుతున్న వీడియో ఒకటి వైరల్‍గా మారింది. దీంతో అధికార జేడీయూ నేతలు తేజస్వీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. అప్పుడే ఆర్జేడీ నేత ఓటర్లను ప్రలోభపెట్టడం మొదలుపెట్టారంటూ ధ్వజమెత్తారు.
వివరాల్లోకి వెళితే.. గోపాల్‌గంజ్‌లోని వైకుంఠపూర్‌లో బీహార్ మాజీ ఎమ్మెల్యే దేవదత్త్ ప్రసాద్ వర్ధంతికి తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డుపై కారులో వెళ్తున్న తేజస్వీ మార్గమధ్యలో ఆగారు. దీంతో ఆయన వద్దకు కొందరు మహిళలు వచ్చారు. దీంతో వారికి రూ. 500 చొప్పున ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి 'ఈయన ఎవరనుకున్నారు.. తేజస్వీ యాదవ్.. లాలూజీ కా బేటా(లాలూ కుమారుడు)' అని ఆ మహిళలకు పరిచయం చేశారు. దీంతో వారిలో ఓ మహిళ తేజస్వీ యాదవ్‌ను ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియోను ఆర్జేడీ యూత్ వింగ్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
पीछे से कोई कहता है, कि ये लाल उन्हीं का है.... जिन्होंने लिखवा ली थी उनकी ज़मीन
— Neeraj kumar (@neerajkumarmlc) September 10, 2021
बदले उसके चंद नोट के टुकड़े, आँचल में सबके डाल आया था...
लालू के लाल से पूछो गरीबी का माखौल क्यों उड़ाया... वोट को नोट क्यों दिखलाया
इंसानों की मज़बूरी का कुछ तो लिहाज़ कर लो...शर्म करलो बबुआ pic.twitter.com/xEYC6KaH8t
ఆ వీడియో వైరల్ కావడంతో జేడీయూ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. 'పేదలకు డబ్బులు పంచుతున్న ఆ రాకుమారుడు ఎవరో..? ఆయన గురించి ఎవరికీ తెలియకపోవడంతో లాలూ జీ కొడుకు అంటూ పరిచయం చేయాల్సి వచ్చింది. ఇలా డబ్బులు పంచినంత మాత్రానా మీ మీద చెడు అభిప్రాయం పోదు. మీరు పేద ప్రజలను ఎగతాళి చేస్తున్నారు. వెళ్లండి కొడుకు గారూ.. మీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోండి' అంటూ జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఆ వీడియోను షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేగాక, డబ్బులు ఇవ్వడం కాదు.. పేద ప్రజల నుంచి తీసుకున్న వారి భూమిని తిరిగివ్వాలంటూ మరికొందరు ఆర్జేడీ అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
కాగా, బీహార్ రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలోనే తేజస్వీ యాదవ్ డబ్బులు పంచడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రాజకీయ నేత ఎలా డబ్బులు పంచుతారంటూ అధికార పక్షం నేతలు మండిపడుతున్నారు.

బీజేపీ-జేడీయూ కూటమి బీహార్ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకున్న ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, మెజార్టీ స్థానాలు దక్కకపోవడంతో ఆర్జేడీ కూటమి ప్రతిపక్షానికే పరిమితమైంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications