వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్ వీరనారి: పిక్నిక్‌ నుంచి వస్తోండగా డ్రైవర్‌కు ఫిట్స్.. 10 కి.మీ బస్సు నడిపిన అతివ..(వీడియో)

|
Google Oneindia TeluguNews

బస్సులో మహిళలు పిక్నిక్‌కు బయల్దేరారు. డ్రైవర్ బస్సును నడుపుతున్నాడు. సడెన్‌గా అతనికి ఫిట్స్ వచ్చాయి. ఇంకేముంది.. ఓరి భగవంతుడా అని అంతా అనుకున్నారు. కానీ మహిళ సమూహంలో ఒకరు వచ్చారు. ఆ స్టీరింగ్ పట్టి బస్సును నడిపారు. 10 కిలోమీటర్లు తీసుకెళ్లి.. అక్కడ గల ఆస్పత్రిలో డ్రైవర్‌కు చికిత్స అందించారు. మహారాష్ట్రలో గల పుణెలో ఈ ఘటన జరిగింది.

పిక్నిక్‌కు వెళ్లి..

పిక్నిక్‌కు వెళ్లి..

పుణెలో గల వాఘొలి ప్రాంతానికి చెందిన మహిళలు.. మొరాచీ చించొలి వద్దకు పిక్నిక్‌కు వెళ్లారు. పిక్నిక్ సరదాగా సాగి.. ఇంటికి బయల్దేరారు. పిక్నిక్ స్పాట్ నుంచి బయల్దేరిన తర్వాత డ్రైవర్‌ పిట్స్ వచ్చాయి. ఆర్గనైజర్ ఆశా వెంటనే డ్రైవర్‌‌ను గమనించి.. బస్సు ఆపాలని కోరింది. డ్రైవర్ బస్సును ఆపాడు. ఆ సమయంలో డ్రైవర్‌కు అలా కావడంతో ఏం చేయాలో తెలియలేదు.

అందులో ఉన్న యోగితా సాతవ్ వచ్చారు. ఆమెకు కారు నడపడం వచ్చు. బస్సును ఎప్పుడూ నడపలేదు. డ్రైవింగ్ ప్రారంభించారు. ఆస్పత్రికి తరలించేలోపు మరో సారి స్ట్రోక్ వచ్చింది. గనెగావ్ ఖాస్లా వద్ద అతనికి ప్రథమ చికిత్స చేశారు. మరో డ్రైవర్ వచ్చి.. మహిళలను దింపివేశారు.

లైసెన్స్ తప్పనిసరి

దేశంలో ప్రతీ ఒక్కరు బస్సు, ట్రక్కు నడిపేందుకు అవకాశం లేదు. స్పెషల్ హెవీ మోటర్ వెహికిల్, హెచ్ఎంబీ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి 6 నెలలపాటు డ్రైవింగ్ చేస్తే.. అతనికి హెవీ లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ మాత్రం రహదారుల మీద వింతగా ఉంటుంది.

చాలా మంది అతివలు

చాలా మంది అతివలు

మహిళ బస్సు నడపడం ఇదీ కొత్త కాదు. చాలా మంది మహిళలు ఆర్టీసీ బస్సులను నడిపిస్తారు. ట్రక్ డ్రైవర్లు కూడా ఉన్నారు. హెవీ వెహికల్స్‌కు పవర్ స్టీరింగ్ ఉండవు. దేశంలో గల రహదారుల మీద లైన్ల మీద వాహనాలు నడపరు. హెవీ వెహికిల్స్ నడిపేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా మంది అలా వాహనాలను నడుపుతున్నారు.కానీ ఇప్పుడు ట్రక్కు, బస్సులకు పవర్ స్టీరింగ్ ఉంటున్నాయి. అందుకోసమే చాలా మంది మహిళలు బస్సులు నడిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

English summary
40-year old driver showed signs of getting a seizure, a woman took over and drove the bus to save the driver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X