216 గంటలు నిరంతరాయంగా భరతనాట్యం.. ప్రపంచ రికార్డు బద్దలు ..!

సాధారణంగా కొన్ని నిమిషాలపాటు డ్యాన్స్ చేయాలంటేనే తెగ ఇబ్బంది పడుతుంటారు చాలా మంది. కానీ కర్ణాటకలోని మంగళూరుకు చెందిన భరతనాట్యం కళాకారిణి విదుషి దీక్ష ఒక గంట కాదు రెండు గంటలు కాదు.. ఏకంగా 170 గంటలకు పైగా నిరంతరాయంగా భరతనాట్యం చేసి ఔరా అనిపించింది. అంతేకాక ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. అంతకుముందు మంగళూరుకు చెందిన రెమోనా ఇవిట్టె పెరీరా రికార్డును అధిగమించింది. ప్రఖ్యాత గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించింది.

కర్ణాటకలోని మంగళూరు సాంస్కృతిక కార్యక్రమాలకు, కళలకు పెట్టింది పేరు. అలాంటి మంగళూరు మరోసారి ప్రపంచ రికార్డుల్లోకెక్కింది. మంగళూరుకు చెందిన భరతనాట్యం కళాకారిణి విదుషి దీక్ష ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఏకంగా 170 గంటలపాటు ఏకధాటిగా భరతనాట్యం చేసి అందిరినీ ఆశ్చర్య పరిచింది. అంతకుముందు మంగళూరుకు చెందిన రెమోనా ఇవిట్టె పెరీరా రికార్డును అధిగమించింది. ప్రఖ్యాత గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించింది.

విదుషి దీక్ష ఆగస్టు 21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు నాట్యం ప్రారంభించింది. అలా నిరంతరాయంగా దీక్ష చేసి గురువారం సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకు 170 గంటలు పూర్తి చేసింది. మొత్తం 216 గంటల పాటు నాట్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దీక్ష. ఆగస్టు 30 మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు ఈ రికార్డు పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఆగస్టు 30 శనివారం సాయంత్రంతో ఆ రికార్డును చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Vidushi Deeksha Dances into History with 170-Hour Bharatanatyam Marathon

ఇక ఏకధాటిగా 170 గంటలపాటు భరతనాట్యం ప్రదర్శన చేసినందుకు ఆమె గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించినట్లు ఆ సంస్థ చీఫ్ మనీష్ విష్ణోయ్ తెలిపారు. దీక్ష అసాధారణ ప్రతిభను, పట్టుదలను అభినందించారు. చిన్న గ్రామం, సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పట్టుదలతో ప్రపంచ రికార్డు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. 216 గంటల పాటు నాట్యం చేయాలన్న లక్ష్యంతో ఆమె ఇంకా నృత్యాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. ఇక రత్న సంజీవ కళా మండలి ఆధ్వర్యంలో దీక్ష భరతనాట్య ప్రదర్శన ఇస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+