ప్రధాని రేసులో విజయ్..! ఏకంగా మూడో స్ధానం..! తాజా సర్వేలో ఏకంగా..!
తమిళనాడులో రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని స్థాపించి, అనతికాలంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ఈ ఏడాది సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జోసఫ్ విజయ్ (Vijay) జాతీయ స్ధాయిలోనూ అంతే వేగంగా పాపులారిటీ పెంచుకుంటున్నారు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో (mood of the nation survey) ఈ విషయం నిర్ధారణ అయింది. తాజా సర్వేలో విజయ్ ప్రధాని రేసులో దేశంలో కీలకమైన నేతల్ని వెనక్కి నెట్టి ఏకంగా మూడో స్ధానంలో నిలిచారు.
2029లో జరిగే ఎన్నికల్లో దేశంలో ప్రధానిగా ఎవరు ఉంటే బాగుంటుందనే అంశంపై ఈ సర్వేలో అడిగిన ప్రశ్నకు టీవీకీ అధినేత విజయ్‌కు 9.2 శాతం మంది మద్దతు ఇచ్చారు. ఈ జాబితాలో 48.7 శాతం మద్దతుతో ప్రధాని నరేంద్ర మోదీ, 27.1 శాతం మద్దతుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన కంటే ముందున్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్ కూటమిలోనే కాంగ్రెస్ కూడా ఉంది. అయినా రాహుల్ తర్వాత ప్రధాని అభ్యర్ధిగా జనం విజయ్ ను ఎంచుకోవడం విశేషం. అలాగే ప్రధాని అభ్యర్థిగా విజయ్ ప్రాచుర్యం నేపథ్యంలో రాహుల్ గాంధీ మద్దతులో కొంత తగ్గుదల ఉండవచ్చని అనుకోవచ్చు.

ప్రధాని అభ్యర్ధుల జాబితాలో విజయ్.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (2 శాతం ఓట్లు), ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ( 1.7 శాతం ఓట్లు), సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (1.3 శాతం ఓట్లు), ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ ( 1.2 శాతం ఓట్లు) కంటే ఎంతో ముందున్నారు. ఈ సర్వేలో విజయ్ కేవలం తదుపరి ప్రధానమంత్రి ఎవరనే ప్రశ్నకు మాత్రమే పరిమితం కాలేదు, ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులలో ఎవరు అత్యంత అనుకూలమైనవారు అని అడిగితే విజయ్ 12.2 శాతం ఓట్లతో మరోసారి అగ్రస్థానానికి సమీపంలో నిలిచారు. 29 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్న రాహుల్ గాంధీ తర్వాతి స్థానంలో, మమతా బెనర్జీ (8.5 శాతం ) అరవింద్ కేజ్రీవాల్ (7.5 శాతం) అఖిలేష్ యాదవ్ (6.9 శాతం ) కంటే ముందున్నారు.













Click it and Unblock the Notifications