విజయమాల్యాకు 'పొలిటికల్' షాక్: రాజ్యసభ రద్దుకు..
న్యూఢిల్లీ: రూ.9వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో ఉంటున్న కింగ్ ఫిషర్ యజమాని విజయ మాల్యాకు మరో షాక్. తప్పించుకు తిరుగుతున్న మాల్యాకు రాజకీయంగా షాకివ్వాలని భావిస్తున్నారు. విజయ మాల్యా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని భావిస్తున్నారు.
మాల్యా రాజ్యసభ సభ్యత్వం రద్దుకు పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. మాల్యా ఎంపీ కాబట్టి ఆయనకు డిప్లమోటిక్ పాస్ ఉంటుంది. రాజ్యసభ సభ్యత్వం నుంచి తప్పిస్తే అది ఉండకుండా పోతుంది. ఆయనను ఢిల్లీకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న మాల్యా చుట్టు ప్రభుత్వం ఉచ్చు బిగించి, ఆయనను దేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యసభ ఎథిక్స్ కమిటీ (నైతిక హక్కుల కమిటీ) సోమవారం నాడు సమావేశమైంది. చర్చించిన అనంతరం మాల్యాను తొలగించాలని నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications