మాల్యాకు ఈడీ సమన్లు: లండన్‌కు ఇలా పారిపోయాడు
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రూ. 9వేల కోట్ల రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా కింగ్‌ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యా ఈ నెల 2న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. అంతేకాదు మాల్యా తీసుకున్న రుణాల కంటే ఎక్కువ ఆస్తులు ఆయనకు విదేశాల్లో ఉన్నాయని ఆయన సుప్రీంకు నివేదించారు.
అయితే మార్చి 2వ తేదీన విజయ్ మాల్యా లండన్‌కు ఎక్కడ నుంచి వెళ్లారు, ఏ విమానంలో వెళ్లారు, తన వెంట ఏం తీసుకొని వెళ్లారనే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత బుధవారం (మార్చి 2)న మాల్యా న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ పారిపోయినట్టు ప్రభుత్వ ఉన్నతాధకారి ఒకరు వెల్లడించారు.
బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ-లండన్ జెట్ ఎయిర్ వేస్ విమానం 9W 122లో బ్రిటన్‌కు వెళ్లిపోయినట్టు తెలిసింది. మాల్యా వెంట ఒక మహిళ కూడా ఉన్నారని, ఫస్ట్‌క్లాస్‌లో ఆయన ప్రయాణించినట్టు విమానాశ్రయ ఉన్నతాధికారి వెల్లడించారు.
విజయ్ మాల్యా తన వెంట భారీ లగేజీని కూడా తీసుకెళ్లారని చెప్పారు. 'మాల్యా తనకు చెందిన ఏడు బ్యాగులను తనిఖీ చేయించుకున్నారు. మాల్యా, ఆయనతో పాటు విమానంలో ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణించివారికి సహాయ సేవలు అందించడం జరిగింద'ని ఆయన వెల్లడించారు.

కాగా, నార్త్ లండన్‌లోని శివారు ప్రాంతంలోని బేకర్ స్ట్రీట్ ప్రాంతంలో ఆయనకు చెందిన 30 ఎకరాల్లో విస్తరించిన 'లేడీవాక్' అనే ఎస్టేట్‌లో ఆయన బస చేసినట్లు మాల్యాను స్థానికులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పబ్‌లకు వెళ్లే మాల్యా ఈసారి బయటకు రాలేదని కూడా చెబుతున్నారు.
దేశ, విదేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టుకున్న మాల్యా నుంచి బ్యాంకులు తమ రుణాలను వసూలు చేసుకోవడం అనుమానమేనని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. మాల్యా దేశం విడిచివెళ్లకుండా సీబీఐ లుక్‌ఔట్ నోటీసు జారీ చేసినప్పటికీ ఆయన లండన్‌కు పారిపోయారు.
ఈ క్రమంలో బ్యాంకులు సుప్రీం కోర్టుని ఆశ్రయించడంతో మార్చి 30న కోర్టు ఎదుట స్వయంగా హాజరుకావాల్సిందిగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మాల్యా తప్పకుండా తిరిగి వస్తారని, ఆ నమ్మకం తనకుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి అంటున్నారు. స్వయంగా వచ్చి బ్యాంకులతో సెటిల్ చేసుకోవడం మేలని ఆయన సూచించారు.
మాల్యా వ్యవహారం రాజకీయ డ్రామాగానే కొనసాగుతుందా ? లేక ప్రభుత్వం, బ్యాంకులు నిజాయితీగా సొమ్ము వసూలుకు చర్యలు తీసుకుంటాయా అన్నది వేచిచూడాల్సిన అంశమేనని విశ్లేషకులు అంటున్నారు. 9,000 కోట్ల రూపాయల రుణాలకు అందులో 10 శాతం విలువైన ఆస్తులను మాత్రమే తాకట్టుపెట్టుకున్న బ్యాంకులు, బ్యాంకు అధికారుల పాత్ర, ప్రమేయంపై కూడా దర్యాప్తు జరపాలని సిబిఐ భావిస్తోంది.
మరోవైపు ఐడిబిఐ బ్యాంకు ఇచ్చిన రుణాల కేసుపై సిబిఐ, ఇడి, ఎస్‌ఎఫ్‌ఐఒ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐడీబీఐలో రుణం తీసుకుని మోసం చేసిన కేసులో మాల్యాకు ఈడీ శుక్రవారం సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అసలు బ్యాంకులు విజయ్ మాల్యాకు బ్యాంకులు రుణాలు ఎలా ప్రాసెస్ చేశాయో అర్ధం కావడం లేదని నిపుణులు అంటున్నారు.
ఏ విధంగా మంజూరు చేశాయి, ఎన్‌పిఎలుగా మారిన పద్దులను వసూలు చేసేందుకు బ్యాంకర్లు సకాలంలో ఎందుకు ప్రయత్నించలేదు, ఆర్‌బీఐ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడానికి కారణమేమిటీ... ఈ ప్రశ్నలకు పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు ఆదేశిస్తేనే నిజానిజాలు బయటకువస్తాయని అంటున్నారు.
కేవలం కింగ్‌ఫిషర్ బ్రాండ్ విలువని తాకట్టుపెట్టుకొని రుణాలివ్వడంపై పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కింగ్‌ఫిషర్ వంటి సంస్థలకు వ్యతిరేకంగా పిర్యాదు చేయడానికి బ్యాంకులు ముందుకు రావడంలేదని ఇటీవలనే సిబిఐ చీఫ్ సిన్హా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగ్గొట్టిన కేసులో నిందితుడిగా ఉన్న మాల్యా దేశం విడిచి వెళ్లారంటూ వస్తున్న వార్తలపై శుక్రవారం ఆయన స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, వ్యాపార నిమిత్తం తరచూ విదేశాలకు వెళుతుంటానని చెప్పుకొచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తనకు భారతీయ చట్టాలపై గౌరవం, నమ్మకం ఉందని పేర్కొన్నారు.
Once a media witch hunt starts it escalates into a raging fire where truth and facts are burnt to ashes.
— Vijay Mallya (@TheVijayMallya) March 11, 2016
News reports that I must declare my assets. Does that mean that Banks did not know my assets or look at my Parliamentary disclosures ?
— Vijay Mallya (@TheVijayMallya) March 11, 2016
Let media bosses not forget help, favours,accommodation that I have provided over several years which are documented. Now lies to gain TRP ?
— Vijay Mallya (@TheVijayMallya) March 10, 2016
As an Indian MP I fully respect and will comply with the law of the land. Our judicial system is sound and respected. But no trial by media.
— Vijay Mallya (@TheVijayMallya) March 10, 2016
I am an international businessman. I travel to and from India frequently. I did not flee from India and neither am I an absconder. Rubbish.
— Vijay Mallya (@TheVijayMallya) March 10, 2016
The editor of Times Now needs to be in prison clothes and eat prison food for libel, deceit, slander and absolutely sensational lies.
— Vijay Mallya (@TheVijayMallya) March 10, 2016
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications