వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ సీఎంగా రాజీనామా చేసిన విజయ్ రూపానీ .. గుజరాత్ ఎన్నికలకు ముందు ఆసక్తికర పరిణామం

|
Google Oneindia TeluguNews

గుజరాత్ రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఊహించని రీతిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం సాయంత్రం తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రూపానీ రాజీనామాకు కారణమేమిటో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది . 2016 నుంచి సీఎంగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ రూపాని తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ కు అందజేశారు.

గాంధీ నగర్ లో జరిగిన మీటింగ్ లో చోటు చేసుకున్న అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన అనంతరం ఆయన తన రాజీనామాపై స్పందించారు. బిజెపి అధినాయకత్వానికి ఇంతకాలం తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు తన రాజీనామాకు గల కారణాలను ప్రశ్నించగా పెద్దగా కారణం లేదన్నారు. తాను ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని, అది చాలా సుదీర్ఘకాలమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు బీజేపీలో నాయకత్వ మార్పు సాధారణమైన ప్రక్రియ అని విజయ్ రూపాని చెప్పుకొచ్చారు.

Vijay Rupani resigns as Gujarat CM .. An interesting development before the Gujarat elections

బిజెపి జాతీయ అధ్యక్షుడి నాయకత్వం కింద తాను పని చేస్తానని విజయ్ రూపాని పేర్కొన్నారు. పీఎం నరేంద్ర మోడీ దిశా నిర్దేశం మేరకు గుజరాత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్ళుగా ప్రజలు బీజేపీపై అమితమైన విశ్వాసం చూపించారని విజయ్ రూపానీ వెల్లడించారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే ఆయన సీఎం కుర్చీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. 2016 ఆగస్ట్ 7 వ తేదీన విజయ్ రూపాని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఇప్పటివరకు సీఎంగా కొనసాగారు.

Recommended Video

Karnataka BJP crisis: CM BS Yediyurappa resigns, will meet Governor at 4pm

ఇటీవలి నెలల్లో రాజీనామా చేసిన నాలుగో బిజెపి ముఖ్యమంత్రి గా విజయ్ రూపానీ నిలిచారు. జూలైలో బిఎస్ యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు . ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో సీఎం తీరత్ సింగ్ రావత్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల అస్సాం ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ కు ఉద్వాసన పలికి ఆయన స్థానంలో అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మకు స్థానం కల్పించారు. ఇప్పుడు తాజాగా విజయ్ రూపానీకి ఉద్వాసన పలికారు. ఇప్పటివరకు ముఖ్య మంత్రులు రాజీనామా చేసినా, ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సి లేకుండా బిజెపి అధినాయకత్వం జాగ్రత్త వహించడం గమనార్హం.

English summary
Gujarat Chief Minister Vijay Rupani unexpectedly resigned from his post on Saturday evening. What caused Rupani's resignation has become interesting in political circles. Vijay Rupani, who has been the CM since 2016, handed over his resignation letter to Governor Acharya Devvrat.An unexpected development has taken place in the state of Gujarat. Prime Minister Narendra Modi's home state of Gujarat will hold assembly elections early next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X