ఎన్నికల్లో విజయం మనదే.. గెలిచిన వాళ్లు అక్కడికి రావాలి: టీవీకే నేతలకు విజయ్ కీలక సూచన

తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే తో పాటు దళపతి విజయ్ టీవీకే పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఇక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ డీఎంకే మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. ఒకటి రెండు సంస్థలు ఏఐఏడీఎంకే పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే విజయ్ టీవీకే పార్టీ ఈసారి తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధిస్తుందని యాక్సెస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. టీవీకే పార్టీకి 98 నుంచి 120 స్థానాలు దక్కుతాయని స్పష్టం చేసింది. అలాగే డీఎంకే పార్టీకి 92 నుంచి 110 స్థానాలు వస్తాయని.. ఇక అన్నాడీఎంకే బీజేపీ కూటమికి 22 నుంచి 32 సీట్లు దక్కుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయ్ కింగ్ లేదా కింగ్ మేకర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో విజయ్.. తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో 234 మంది అభ్యర్థులతో విజయ్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు విజయ్ టీవీకే నేతలకు కీలక సందేశం ఇచ్చినట్లు సమాచారం. వారి నుంచి ముందుగానే మద్దతు లేఖలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి ఎదురయ్యే ప్రలోభాలకు గురి కాకుండా విజయ్ పక్కాగా ప్లాన్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ టీవీకే పార్టీకి అనుకూలంగా రావడంతో ఈ మేరకు విజయ్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Vijay Strong Message to TVK Candidates Do Not Go Anywhere We Are the Ones Winning Vijay TVK

" గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడికీ వెళ్లొద్దు. విజయం సాధించిన వెంటనే పనైయూర్ కు రండి.. నేను అక్కడ మీకోసం ఎదురుచూస్తుంటాను. అందరూ పట్టుదలతో వెయిట్ చేయండి. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని నాకు నమ్మకం ఉంది. మీరు ఇప్పటివరకూ చాలా అద్భుతంగా పని చేశారు. మే 4 న కౌంటింగ్ సమయంలోనూ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండండి" అని టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. ఇక యాక్సెస్ మై ఇండియా సర్వే అంచనా ప్రకారం.. విజయ్ కు 35 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే 37 శాతం మద్దతుతో విజయ్ సీఎం పదవికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా ఉన్నారని స్పష్టం చేసింది. దాంతో అటు టీవీకే నేతలు, ఇటు విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+