1500కోట్లు తీసుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నానా ?: విజయకాంత్

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాంచీపురం జిల్లా మామండూరులో ఆదివారం రాత్రి జరిగిన డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి సభలో విజయకాంత్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయకాంత్ మాట్లాడుతూ.. ఎన్నికల పొత్తుకు సంబంధించి రూ.1,500 కోట్లు సీఎం జయలలిత నుంచి తీసుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నానా? అని విజయకాంత్‌ ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించానని చెప్పారు.

ఎన్నికల ప్రచారానికి సంబంధించి మళ్లీ జిల్లాలకు వెళ్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం సమయం 9.30 దాటిందని, పది గంటలకల్లా ముగించకపోతే ఏదో ఒక కేసులో జయలలిత అరెస్టు చేయిస్తారని ఆరోపించారు.

Vijayakanth Speech: Do I Look Like a Man Who took 1500 Crore From Jayalalthaa ?

'జయలలితకు ప్రత్యర్థి కరుణానిధి, కరుణకు ప్రత్యర్థి జయ... వీరిద్దరి ప్రత్యర్థి నేనే' అని విజయకాంత్ పేర్కొన్నారు. అంతేగాక, స్టాలిన్‌కు ఆయనే విరోధి అని చెప్పారు. తన కోసం జైళ్లకు వెళ్లిన వారి కుటుంబాలకు అండగా ఉంటానన్నారు.

ప్రజల కోసమే తాను ఉన్నానని, ప్రజలు ఇచ్చిన పదవిని చులకనగా భావించనని స్పష్టం చేశారు. ప్రతిపక్షనేతగా తనకు ఇచ్చిన కారును కూడా వినియోగించుకోలేదని చెప్పారు.

తన వద్ద మిగిలిన పార్టీలు అనుకున్నట్లు డబ్బు లేదని, కూటమి కోసం రూ.1,500 కోట్లు తీసుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించారు. డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి తప్పకుండా గెలుస్తుందని.. అందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+