కూతుళ్లపై అఘాయిత్యం... తల్లికి 40ఏళ్ల జైలు శిక్ష...
సమాజంలో మానవసంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. రక్తసంబంధీకులు సైతం తాము మనుషులమనే విషయాన్నిమరిచి మృగాలుగా మారుతున్నారు. తాజాగా కేరళలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనం. అయితే, అందుకు తగ్గట్టుగానే న్యాయస్థానం కూడా మనిషి రూపంలో ఉన్నా మానవ మృగానికి తగిన శిక్ష వేసింది. కూతురిపై అత్యాచారానికి సహకరించిన ఓ మహిళకు 40 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల ఫైన్‌ను కూడా విధించి సమాజానికి ఓ హెచ్చరికను పంపించింది కోర్టు. కేరళలోని తిరువనంతపురంలో కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు వివరాలేంటో ఓ సారి చూద్దాం..
అమ్మాయిలపై, చిన్నారులపై అఘాయిత్యాలు జరిగితే ఏ తల్లి హృదయమయినా తల్లడిల్లిపోతుంది. కానీ కేరళలోని ఓ తల్లి మాత్రం కూతురిపై అత్యాచారానికి తన ప్రియుడికే సహకరించింది. కూతుళ్లను పదే పదే ప్రియుడి ఇంటికి తీసుకెళ్లడం చేసింది. ఇంతటి పాపానికి పాల్పడిన ఆ కన్నతల్లికి తాజాగా కేరళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 40 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా కట్టాలని ఆదేశించింది. పోక్సో చట్టం కింద విచారించిన కోర్టు ఈ తీర్పును వెలువరించడం జరిగింది. ఈ సంఘటన తాజాగా తిరువనంతపురం పట్టణంలో వెలుగు చూసింది.

కూతుళ్లపై అత్యాచారానికి సహకరించిన కన్నతల్లి :నగరానికి చెందిన సదరు మహిళ భర్త అనారోగ్యంతో మంచాన పడ్డాడు. దీంతో ఆ మహిళ పిల్లలను తీసుకుని వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ శిశుపాలన్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో తరుచుగా ప్రియుడి ఇంటికి వెళ్లిరావడం వంటివి చేసేది. అయితే శిశుపాలన్ ఆ మహిళ కూతుళ్లపై కన్నేసాడు. ఆ అమ్మాయిలను తన ఇంటికి తీసుకురమ్మని ఆ మహిళపై ఒత్తిడి చేశాడు. దీంతో తన ప్రియుడి సంతోషం కోసం కన్నబిడ్డలను కష్టాల పాలు చేసింది ఆ కన్నతల్లి. కూతుళ్లనే కనికరం కూడా లేకుండా తరుచుగా శిశుపాలన్ ఇంటికి తీసుకెళ్లేది. తనముందే అతడు కూతుళ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవాల్సిన తల్లి కాస్తా అతనికి సహకరించింది. తరచుగా ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నారు ఈమైనర్ పిల్లలిద్దరూ. అయితే, ఈ దారుణాలు 2018-19 మధ్యలో చోటుచేసుకున్నాయి.
కౌన్సిలింగ్‌లో బయటపడ్డ దారుణాలు : తల్లిప్రవర్తనతో విసుగుచెందిన పిల్లలు అక్కడినుంచి పారిపోయి నానమ్మ ఇంటికి చేరుకున్నారు. ఆ నాన్నమ వారిద్దరిని పిల్లల సంరక్షణ కేంద్రంలో చేర్పించింది. అక్కడ నిర్వహించిన ఓ కౌన్సిలింగ్‌లో ఈ పిల్లలిద్దరూ తమపై జరిగిన అఘాయిత్యాలను బయటపెట్టడం జరిగింది. దీంతో పోలీసులు తల్లి, శిశుపాలన్‌ఫై కేసు నమోదు చేసి వారిని జైలుకు తరలించారు. అయితే, విచారణ కొనసాగుతుండగానే శిశుపాలన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక బాధితురాలికి మాత్రం 40 ఏళ్లజైలు శిక్ష, రూ. 20 వేల ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.












Click it and Unblock the Notifications