వావ్.. సింపుల్‌గా పెళ్లి, రూ.500తో పూర్తి.. ఇద్దరు ఉన్నత ఉద్యోగులే..
పెళ్లంటే ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా జరుపుకుంటున్నారు. డబ్బు ఉన్న లేకున్నా.. వెనకాడటం లేదు. ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే ఓ రేంజ్ వారి వివాహ వేడుకలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని పెళ్లి వేడుకలు మీడియాను సైతం ఆకర్షిస్తుంటాయి. అందుకు భిన్నంగా అసలు హంగామా లేకుండా ఇద్దరు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు పెళ్లి చేసుకున్నారు.

వివాహానికి విపరీతంగా ఖర్చులు పెడుతున్న సంప్రదాయానికి స్వస్తి పలుకారు. మహారాష్ట్ర ధార్ జిల్లాలో ఓ ఆర్మీ మేజర్ , సిటీ మెజిస్ట్రేట్ సింపుల్‌గా పెళ్లి తతంగాన్ని ముగించారు. ఇరుకుటుంబాల సమక్షంలో వీరివురు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎంత సింపుల్‌గా అంటే కేవలం దండలు, స్విట్లు కోసం రూ.500 ఖర్చు చేశారు. వధువు శివంగి జోషి ధార్ నగర మెజిస్ట్రేట్ కాగా, వరుడు అంకిత్ చతుర్వేది భారత సైన్యంలో మేజర్‌గా లడఖ్‌లో పని చేస్తున్నారు. వీరిద్దరూ భోపాల్‌కు చెందినవారు.
వీరి వివాహం రెండు సంవత్సరాల క్రితం నిశ్చయమైంది. మేజర్ అంకిత్ చతుర్వేది లడఖ్‌లో పని చేస్తుండగా, శివంగి ధార్ జిల్లాలో సిటి మెజిస్ట్రేట్‌గా కరోనా అడ్డుకట్టకు నిరంతరంగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వీరి వివాహ తేది వాయిదా పడుతూ చివరకు ఇలా చేసుకున్నారు. కరోనా ఇంకా పూర్తిగా అంతం కాలేదని, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని శివంగీ కోరారు. "వివాహానికి విపరీతంగా ఖర్చు చేయడం నచ్చలేదని, అందుకే ఇలా చేసుకున్నామని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications