Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: ఎమ్మెల్యేను ఈడ్చి కొట్టిన మహిళ

చండీగఢ్: భారీ వర్షాలు.. ఉత్తరాది రాష్ట్రాలను వదలట్లేదు. అల్లకల్లోలానికి గురి చేస్తోన్నాయి. ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి.. ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్.. ఇలా ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలు అతలాకుతలమౌతోన్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం ఆయా రాష్ట్రాల్లో నమోదవుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ.. భారీ వర్షాలకు చివురుటాకులా వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్, రావి, సట్లేజ్.. నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్నాయి. ఆయా నదులపై నిర్మించిన బాస్పా, వాంగ్టో, నథ్పా రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకోవడంతో గేట్లన్నింటినీ ఎత్తివేశారు అధికారులు. దీని ప్రభావం తీర ప్రాంతాలపై పడింది.

Viral video: A flood victim slapping JJP MLA Ishwar Singh in Haryana

బియాస్, రావి, సట్లేజ్ నదుల తీరప్రాంతాలన్నీ మునిగిపోయాయి. పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగి పడటంతో అటు రోడ్లు కూడా ఎక్కడికక్కడ ధ్వంసం అయ్యాయి. కొండ ప్రాంతాల్లో ఉండే రోడ్లే కాకుండా.. జాతీయ రహదారులు సైతం భారీ ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఇక వంతెనల గురించి చెప్పుకోనక్కర్లేదు.

అటు హర్యానాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హిమాచల్ ప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న హర్యానాలో పలు జిల్లాలు వరదముంపునకు గురయ్యాయి. ప్రత్యేకించి అంబాలా, పంచ్‌కుల, కురుక్షేత్ర, కర్నాల్, యమునానగర్, పానిపట్, కైథల్.. జిల్లాలు వరదల బారిన పడ్డాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసింది.

కైథల్ జిల్లాలో ఈ సాయంత్రం అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గుహ్లాలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన శాసన సభ్యుడు ఈశ్వర్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. వరద బాధితురాలు ఒకరు ఆయనపై చేయి చేసుకున్నారు. ఇప్పుడు తీరిగ్గా వస్తోన్నావా? అంటూ నిలదీసిన ఆమె అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యేను ఈడ్చి కొట్టారు.

జన్‌నాయక్ జనతా పార్టీకి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లినప్పుడు ఆయనను స్థానికులు నిలదీశారు. వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటోన్నామంటూ ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వారు వినిపించుకోలేదు. మాట్లాడుతుండగానే ఓ మహిళ ఆయన చెంప పగులగొట్టారు. దీనితో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+