వైరల్ వీడియో: ప్రతి అమ్మాయి చూడాల్సిన వీడియో ఇది..!

ఇండియన్ రైల్వేస్ దేశంలోనే అతిపెద్ద వ్యవస్థ. 1853 నుంచి భారత్ లో నిరంతరాయంగా రైళ్లు నడుస్తూనే ఉన్నాయి. వందల ఏళ్ల నుంచి ఎన్నో మార్పులు వచ్చాయి. రైల్వేస్ లో అధికారులు, కేంద్ర ప్రభుత్వాలు అనేక మార్పులను తీసుకొచ్చాయి. ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల నుంచి నేడు వందేభారత్ లాంటి అధునాతన రైళ్ల వరకు అనేక మార్పులు జరిగాయి. ఇక రేపోమాపో బుల్లెట్ ట్రైన్ కూడా భారత్ లో పరుగులు పెట్టనుంది.

నిత్యం లక్షలాది మంది ఇండియన్ రైల్వేస్ లో ప్రయాణం చేస్తుంటారు. ఏటేటా రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. టికెట్ వ్యవస్థను సులభతరం చేయండంతో ఈ సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రైల్వేస్ లో భద్రతపై ఎప్పుడూ ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. రైళ్లలో ముఖ్యంగా మహిళలకు సరైన భద్రత లేదని ఇప్పటికే చాలా ఘటనలు నిరూపించాయి. ఇటీవల ఏపీలో కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. రైలు బోగీలో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Viral Video Alert Young Woman s Must-Know Safety Tips for Women on Train Travel

ఇక తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దిల్లీ రైల్వే స్టేషన్ లో దిగగానే మహిళలు, అమ్మాయిలు ఏం చేయాలన్న దానిపై అవగాహన కలిగిస్తూ ఓ యువతి ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. రైల్వే స్టేషన్ లో దిగగానే మొదట ఏం చేయాలి అని చూపించింది. ఆమె ఓ బ్యాగును వీపుకు తగిలించుకుని సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని రైలు దిగింది. వెంటనే సెల్ ఫోన్ ను ముందు పాకెట్ లో భద్రంగా పెట్టుకుంది. అలాగే వెనకాల వేసుకున్న బ్యాగును తీసి ముందుకు వేసుకుంది. అమ్మాయిలు రైల్వే స్టేషన్ లో ఇలా చేయాలని ఈ వీడియోలో చెప్పకనే చెప్పింది ఆ యువతి.

కేవలం దిల్లీ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు.. సాధారణంగా దేశంలోని ఏ ప్రముఖ రైల్వే స్టేషన్లలో అయినా రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీలో భాగంగా కొందరు ఆకతాయిలు ప్రయాణికులు ఫోన్ లు.. బంగారు ఆభరణాలు.. ఇతర వస్తువులను కాజేయడం చేస్తుంటారు. మరికొంతమంది రద్దీని ఆసరాగా చేసుకుని మహిళలు, అమ్మాయిల్ని తాకరాని చోట తాకుతూ ఇబ్బంది పెడుతుంటారు. ఆ సమయంలో వారు ఎవరికీ చెప్పుకోలేరు. ఈ క్రమంలో మహిళలు రైల్వే స్టేషన్ లో ఇలా చేయాలంటూ ఆమె వీడియో పోస్టు చేసింది. ఈ వీడియోకు ఇప్పటికే 14 లక్షల లైక్స్ వచ్చాయి. లక్షలాది మంది ఈ వీడియోను ఆదరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+