Viral Video:వెంటిలేటర్‌పై ఉన్న మహిళకు గోమూత్రమా..? బీజేపీ నేత నిర్వాకం
కరోనావైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. అప్పటి వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి సైతం క్షణాల్లో ఈ కనిపించని శతృవుకు బలైపోతున్నాడు. ఇక రోజు రోజుకూ దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక కరోనా వేళ ప్రజలు మూఢనమ్మకాలకు కూడా దగ్గరవుతున్నారు. ఎవరో ఏదో చెప్పింది విని సొంత వైద్యం చేసుకుంటూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సాధారణ ప్రజలు పరిస్థితి ఇలా ఉంటే ఓ బీజేపీ నేత కూడా మరో మెట్టు ఎక్కి దారుణంగా వ్యవహరించారు. ఇంతకీ ఆ నాయకుడు ఏం చేశాడో తెలుసా..?
వృధ్దురాలికి గోమూత్రం
వారం రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూశాక కడుపులో తిప్పేస్తోందని కొందరు కామెంట్స్ చేయగా... గోమూత్రానికి మించిన పరమ ఔషధం మరొకటి లేదంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఇంతకీ ఈ కథ ఏంటో చూద్దాం. ప్రముఖ జాతీయ ఛానెల్ ఏబీపీ లైవ్ ప్రకారం ముందుగా ఈ వీడియోను ట్విటర్‌లో సూరత్ జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ కిషోర్ బిందాల్ పోస్టు చేశారు. ఈ వీడియోకు 80వేల వ్యూస్ రాగానే వెంటనే డిలీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరో సోషల్ మీడియా సైట్ పై పోస్టు చేయడం జరిగింది.

కరోనా విరుగుడుకు గోమూత్రం..?
కోవిడ్ బారిన పడి వెంటిలేటర్‌పై ఉంటూ శ్వాస తీసుకునేందుకు పోరాడుతోన్న ఓ వృద్ధురాలి నోట్లో ఓ బీజేపీ నేత గోమూత్రం పోశాడు. అంతేకాదు ఆమెతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేశాడు. అయితే హాస్పిటల్ ఎక్విప్‌మెంట్ నుంచి ఇతర శబ్దం రావడంతో ఆ వృద్ధురాలితో ఆ వ్యక్తి ఏమాట్లాడాడో స్పష్టంగా వినిపించలేదు. ఇక దేశంలో కొన్ని హిందుత్వ సంస్థలు కరోనాను జయించేందుకు గోమూత్రంను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. అసలు ఇంగ్లీష్ మందులతో పనే లేదంటూ కరోనాను జయించేందుకు గోమూత్రమే పరమఔషధమని ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. వీరి వాదన ఇలా ఉంటే... గోమూత్రం కరోనాకు లేదా క్యాన్సర్‌కు విరుగుడుగా వ్యవహరిస్తుందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.
Recommended Video

నెటిజెన్లు ఏమన్నారంటే..
ఇక ఈ వీడియో చూసిన పలువురు స్పందించారు. సైన్స్‌ను విశ్వసించే చోటు ఇలా గోమూత్రం అందించడమేంటని ప్రశ్నించారు. ఆ గోమూత్రం నేరుగా ఆ వృద్ధురాలి ఊపిరితిత్తులకు చేరుతుందని చెప్పారు. అసలు హాస్పిటల్ వర్గాలు ఇలా ఎలా అనుమతించాయని ప్రశ్నించారు. అయితే అది గోమూత్రం అని కచ్చితంగా చెప్పలేమని మరికొందరు అన్నారు. అది మ్యూకోలిటిక్ డ్రగ్ ఉండే అవకాశం ఉందని.. ఆ టాబ్లెట్ నీటిలో కలిపిన తర్వాత ఆ రంగులోకి మారుతుందని చెప్పారు. ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల శ్వాసనాళాలు క్లియర్ అవుతాయని తద్వారా ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇదిలా ఉంటే మరొక నెటిజెన్ ఇది పవిత్రమైన గంగానది నీరు ఉండొచ్చని చెప్పారు. ఆ జలంలో రంగు వేసి ఉంటారని చెప్పారు.
వైరల్‌గా మారిన ఈ వీడియోపై బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన విడదుల చేయలేదు. అంతేకాదు గోమూత్రం తీసుకున్న తర్వాత ఆ వృద్ధురాలి పరిస్థితిపై కూడా అప్‌డేట్ లేదు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications