Viral video : అమాంతం వరుడిని ముద్దు పెట్టుకున్న వధువు సోదరి... అంతా అవాక్కయ్యేలా...
సరదాగా ఆటపట్టించాలనుకుందో లేక అత్యుత్సాహమో తెలియదు గానీ ఓ పెళ్లిలో వధువు సోదరి చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అతని చెంపపై ముద్దు పెట్టేసింది. అంతేనా... గాఢమైన తన ముద్దు నుంచి వరుడు తప్పించుకోకుండా... రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి గట్టిగా అదిమిపట్టింది. ఆమె ముద్దు ధాటికి ఆ వరుడు కొద్ది క్షణాలు విలవిల్లాడిపోయాడంటే అతిశయోక్తి కాదేమో.
సాధారణంగా పెళ్లిలో వధూవరులతో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు ఫోటోలు దిగడం కామన్. ఆ వీడియోను గమనిస్తే... అక్కడ కూడా అదే తంతు జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కాబావలతో ఫోటో దిగేందుకు వచ్చిన వధువు సోదరి... ఊహించని చర్యకు పాల్పడింది. బావను ఆటపట్టించాలనుకుందో,లేక అత్యుత్సాహమో తెలియదు గానీ అమాంతం అతన్ని ముద్దు పెట్టుకుంది. అతని మెడ చుట్టూ చేతులతో అదిమిపట్టి మరీ గాఢమైన ముద్దు పెట్టింది. మరదలు చేసిన పనికి ఆ వరుడు బిత్తరపోగా... స్టేజీపై ఉన్నవారంతా విరగబడి నవ్వేశారు.

ఈ ఘటన ఎప్పుడు,ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. చాలామంది నెటిజన్లు వీడియో చూసి పగబలడి నవ్వుతున్నారు. ఇదో రకమైన ప్రాంక్ ఏమో అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో అసలక్కడ ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదని కామెంట్ చేశారు. ఏదేమైనా భారతీయ పెళ్లిళ్లంటేనే సందడి,హడావుడి,ఆటపట్టించడాలు,సరదాలు ఉంటాయని అంటున్నారు. అందులోనూ బావ మరదళ్ల మధ్య ఆట పట్టించడాలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయని.... అయితే ఈ వీడియోలో అమ్మాయి మరీ గడుగ్గాయిలా కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు.
ఇటీవల మరో పెళ్లి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో గమనిస్తే... పెళ్లి క్రతువుకు పురోహితుడు కాస్త గ్యాప్ ఇచ్చిన సమయంలో.. వధూవరులు 'ఫ్లిప్ బాటిల్' గేమ్ ఆడుతూ కనిపించారు. అంటే,చేత్తో ఒక బాటిల్ పట్టుకుని... దాన్ని రివర్స్‌లో ఎగరేస్తే తిరిగి కరెక్ట్ పొజిషన్‌లో అది పడాలి. వధూవరులు పెళ్లి మంటపంలో ఇలా టైమ్ పాస్ చేస్తూ గడపడం చాలామందిని ఆకట్టుకుంది.
-
విజయ్ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications