భగవాన్ మాష్టారు తిరిగొచ్చేశారు ... పిల్లలంతా హ్యాపీసే

భగవాన్ మాష్టారు... గుర్తుందిగా ఈ పేరు. సరిగ్గా వారంరోజుల క్రితం నెట్టింట్లో వైరల్‌గా మారింది భగవాన్ మాష్టార్ ఫోటో... ఏంటి ఇంకా గుర్తుకు రాలేదా... అదేనండీ... తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలోని వెళియగరమ్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న భగవాన్ మాస్టర్... బదిలీ పై వేరొక స్కూలుకు వెళుతుండగా పిల్లలంతా ఆయన్ను అడ్డుకుని ఎక్కడికి వెళ్లరాదంటూ తమ ప్రేమను చాటుకున్నారు. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది.

Recommended Video

    తమిళనాడులో గురువు పై విద్యార్థుల ప్రేమ

    అవును నిజమే... పిల్లలు వారి తల్లిదండ్రులు భగవాన్ మాస్టర్ ట్రాన్స్‌ఫర్ పై ధర్నాకు దిగడంతో తమిళనాడు ప్రభుత్వం దిగొచ్చింది. అప్పుడే ఆయన బదిలీకి తాత్కాలికంగా బ్రేక్ వేసినప్పటికీ...తాజాగా ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు. భగవాన్‌ను బదిలీ చేయడం లేదని ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ.

    viral video effect: Bhagawan the teacher, posted back in the same school

    భగవాన్ మాస్టారు బదిలీ రద్దు కావడం...తిరిగి అదే స్కూలుకు రావడంతో పిల్లల్లో ఆనందం ఆకాశానంటింది. అంతా సంబురాలు చేసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. భగవాన్ మాస్టారు తిరిగి స్కూలుకు వచ్చారన్న వార్త విన్న విద్యార్థులు స్కూలుకు పరుగులు తీశారు. మాస్టారును హత్తుకుని తమ ప్రేమను చాటారు. భగవాన్ కూడా అంతే ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలు తన కోసం పడ్డ తపన చూసి భగవాన్ కళ్లు చెమర్చాయి. తిరిగి స్కూలుకు రావడం చాలా ఆనందంగా ఉందని భగవాన్ చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+