వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:బయటివాళ్లతో ఎంపీలపై దాడి -సంచలన ట్విస్ట్ -టైమ్ లైన్, వీడియోతో మోదీ సర్కార్ ఎదురుదాడి

|
Google Oneindia TeluguNews

ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవాలయం లాంటిదైతే, సభాపతి పోడియం గర్భగుడి లాంటిదన్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. అదే గుడిలోకి బయటికి వ్యక్తులు చొరబడి, మహిళా ఎంసీలను చెరబడితే చూస్తూ కూర్చోవడమేంటంటూ విపక్ష ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు రాజ్యసభలో చోటుచేసుకున్న అసాధారణ ఘటనలపై కాంగ్రెస్ సహా 15 ప్రతిపక్ష పార్టీలు గురువారం నాడు పార్లమెంట్ భవనం నుంచి విజయ్ చౌక వరకు నిరసన ర్యాలీ చేశాయి. ప్రతిపక్ష ఎంపీల బృందం ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసి మహిళా ఎంపీలపై దాడి ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అయితే..

షాకింగ్: బయటివాళ్లు చొరబడి మహిళా ఎంపీలను కొట్టారు -వెంకయ్యా.. ఇదేంది? -రాహుల్, విపక్షాల ఫైర్షాకింగ్: బయటివాళ్లు చొరబడి మహిళా ఎంపీలను కొట్టారు -వెంకయ్యా.. ఇదేంది? -రాహుల్, విపక్షాల ఫైర్

బయటి వ్యక్తులు.. దాడి..

బయటి వ్యక్తులు.. దాడి..

రాజ్యసభలోకి బయటి వ్యక్తుల చొరబాటు, మహిళా ఎంపీలపై దాడి తదితర ఘటనలపై ఇటు ఇటు ప్రతిపక్షం, అటు ప్రభుత్వం భిన్నవాదనలు చేస్తున్నాయి. సభలోకి బయటివాళ్లు దూరి దాడులు చేశారన్న విపక్షాల వాదనను ప్రభుత్వం గట్టిగా కౌంటర్ చేసింది. రాజ్యసభలో నిన్న ఏం జరిగిందనే వివరాలను సీసీటీవీ ఫుటేజీ, టైమ్ లైన్ల ద్వారా ప్రభుత్వం బయటపెట్టింది. రక్తపాతం లేని ఆ రచ్చ తాలూకు వీడియో ఇప్పుడు వైరలైంది. చేసిన తప్పులకుగానూ విపక్షాలన్నీ యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేయగా, దాడి జరిగిన మాట వాస్తవమని, ఎప్పటిలాగే మోదీ ప్రభుత్వం తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నంలో ఉందని విపక్ష ఎంపీలు అన్నారు.

వివాహేతర సంబంధం కోణం కూడా -కాలిపోయిన కారు డిక్కీలో బీజేపీ నేత శవం కేసుపై చందన దీప్తి వివరణవివాహేతర సంబంధం కోణం కూడా -కాలిపోయిన కారు డిక్కీలో బీజేపీ నేత శవం కేసుపై చందన దీప్తి వివరణ

రాజ్యసభలో అసలేం జరిగింది?

రాజ్యసభలో అసలేం జరిగింది?


పార్లమెంట్ సమావేశాలు అర్ధాంతరంగా ముగిసిన బుధవారం నాడు రాజ్యసభలో అనూహ్య ఘటనలు జరిగాయి. పెగాసస్ సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో పలు వాయిదాల తర్వాతా నిరసనల మధ్యే ఓబీసీ బిల్లు (127వ రాజ్యాంగ సవరణ బిల్లు)పై చర్చను చేపట్టారు. ఆ బిల్లు పాసైన మరుక్షణమే. దేశంలోని జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను ప్రైవేటీకరించేందుకు ఉపకరించే బీమా బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ చర్యను నిరసిస్తూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎన్నడూ లేని విధంగా మార్షల్స్ ను రప్పించిన ప్రభుత్వం.. మహిళా ఎంపీలు నిరసన తెలిపే దగ్గర పురుష భద్రతా సిబ్బందిని, పురుష ఎంపీలు నిరసన తెలుపుతున్న చోట మహిళా భద్రతా సిబ్బందిని అడ్డుగా ఉంచింది. ఈ క్రమంలోప్రతిపక్ష సభ్యులు బిల్లు కాగితాలను చించి చైర్‌ పైకి, సభ అధికారులపైకి విసిరేయడం, మార్షల్స్ తో ఎంపీల పెనుగులాట చోటుచేసుకున్నాయి. పురుష మార్షల్స్‌ తమపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీలు ఛాయా వర్మ, ఫులో దేవీ నేతమ్‌ ఆరోపించారు. అయితే..

షాకింగ్ వీడియో.. ఇదీ జరిగింది..


రాజ్యసభలోకి బయటి వ్యక్తులు ప్రవేశించారన్న వాదనను, మహిళా ఎంపీలపై దాడి జరిగిందనే ఆరోపణను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆ మేరకు రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ తాలూకు సీసీటీవీ ఫూటేజ్‌ వీడియోలను కేంద్ర మంత్రులు విడుదల చేశారు. సభలోకి వచ్చింది మార్షల్స్ మాత్రమేనని, బయటి వ్యక్తులు కాదని కేంద్ర మంత్రులు చెప్పారు. మొత్తం 2.50 నిమిషాల నిడివిగల వీడియోలో.. నినాదాలు చేస్తున్న ఎంపీలు, వాళ్లకు అడ్డుగా మార్ష‌ల్స్ నిలబడటం, చైర్ వైపు దూసుకొచ్చే ఎంపీలను మార్షల్స్ అడ్డుకోవడం, పేపర్ల చించివేత, ఓ ఎంపీ టేబుల్ పైకి ఎక్కి, మార్షల్ మీదుగా చైర్ వైపునకు వెళ్లే ప్రయత్నం చేయడం, మహిళా మార్షల్స్, పురుష మార్షల్స్ తో విపక్ష ఎంపీలు పెనుగులాటకు పాల్పడటం, తదితర దృశ్యాలన్నీ వీడియోలో రికార్డయ్యాయి. ఎవరు ఎవర్ని ఎందుకు లాగేస్తున్నారనేది వీడియోలో అస్పష్టంగానే ఉంది. అయితే,

వాళ్లు బయటి వ్యక్తులు కారు..

వాళ్లు బయటి వ్యక్తులు కారు..


వర్షాకాల సమావేశాల చివరిరోజు రాజ్యసభలో చోటుచేసుకున్న ఘటనలపై గురువారం నాడు ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. విపక్షాలు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. సభ సజావుగా సాగనీయకుండా ఆటంకం సృష్టించడం, బెదిరింపు ధోరణులతో వ్యవహరించినందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రులు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లోకి బయటి వ్యక్తులను తీసుకొచ్చి దాడిచేయించారన్న విపక్ష నేతల ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు నాటకాలాడుతున్నాయని, పార్లమెంట్‌లోకి బయటివారెవరినీ అనుమతించలేదని కేంద్రమంత్రులు స్పష్టంచేశారు. లోపలికి వచ్చింది మార్షల్స్ మాత్రమేనని, ఆ మార్షల్స్ కూడా ఎంపీలను ముట్టుకోవడం గానీ, కనీసం అలాంటి ఆలోచన కూడా చేయలేదని కేంద్ర మంత్రులు తెలిపారు. అంతేకాదు, విపక్ష ఎంపీలే మార్షల్స్ పై దాడి చేశారని ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిపక్ష ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్‌ను కోరుతామని మంత్రులు చెప్పారు. మరోవైపు,

కొట్టినందుకు క్షమాపణ చెప్పాలా?

కొట్టినందుకు క్షమాపణ చెప్పాలా?

రాజ్యసభలో బుధవారం జరిగిన రచ్చపై విపక్ష, అధికార పక్షాలు భిన్నవాదలు కొనసాగుతోన్న దరిమిలా చైర్మన్ వెంకయ్య నాయుడు ఎలాంటి చర్యలకు ఆదేశిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మహిళా ఎంపీలపై దాడి ఘటనను తీవ్రంగా భావించి విచారించాలని విపక్ష ఎంపీల బృందం వెంకయ్యకు వినతి పత్రం ఇవ్వగా, ప్రతిపక్ష ఎంపీలపై చర్యలు కోరుతూ తాము కూడా వెంకయ్యను కలుస్తామని కేంద్ర మంత్రులు ప్రకటించారు. సభలో వ్యవహరించిన తీరుకు విపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలన్న కేంద్ర మంత్రుల మాటకు కాంగ్రెస్‌ మహిళా ఎంపీ, రాజ్యసభలో కాంగ్రెస్ కొత్త విప్ ఛాయా వర్మ ఘాటు కౌంటరిచ్చారు. రాజ్యసభలో బుధవారం జరిగిన సంఘటనలో తమ పార్టీ మహిళా ఎంపీ గాయపడ్డారని, సెక్యూరిటీ సిబ్బంది చేయిచేసుకున్న మాట వాస్తవమని, ఈ ఘటనకు బాధ్యులెవరని ఆమె ప్రశ్నించారు. సభలో అంత మంది మార్షల్స్‌ను ఎందుకు మోహరించారో చెప్పాలని నిలదీశారు. పార్లమెంటు కార్యకలాపాలు నడపడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రతిపక్షంగా ప్రజల గొంతును సభలో వినిపిస్తున్నామని, ప్రజల గొంతును ప్రభుత్వం వినడంలేదు కాబట్టి సభలో ఇలాంటివి జరుగుతున్నాయని ఛాయా వర్మ అన్నారు.

English summary
the Modi government have released a video of the incident in a bid to ‘expose’ the Opposition. In the video, protesting MPs including women members, and lady marshals could be seen involved in a scuffle. However, it's not yet clear whether a woman marshal was pulling a woman MP or was it vice versa. The Centre on Thursday asked the opposition leaders to apologise for the throwing rulebook at Rajya Sabha Chair and standing atop tables right below where the Speaker sits. Union minister Anurag Thakur accused the Opposition of having planned to disrupt the monsoon session of Parliament since day one. Prahlad Joshi said that the leaders tried to break open the door and injured a woman marshal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X