viral video: ఒళ్లు గగుర్పొడిచే బీభత్సం -లోయలోకి కుప్పకూలిన ఘాట్ రోడ్డు -NH 707 మూసివేత

వాతావరణంలో మార్పులకు భారీ విధ్వంసాలు తప్పవనడానికి మరో సంకేతంగా ఇటీవలి హిమాచల్ ప్రదేశ్ కొండచరియల ఘటనలు ఉదాహరణగా నిలిచాయి. పూర్తిగా కొండలతో నిండిఉన్న ఆ రాష్ట్రంలో కొద్ది రోజులుగా వానలు దంచికొడుతుండటంతో, వరదలు, కొండచరియలు విరిగిపడుతోన్న సంఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. తాజాగా, అక్కడి సిర్మౌర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన తాలూకు బీభత్స దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి..

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల ధాటికి శుక్రవారం కూడా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో కొన్ని జనసమర్థం ఉండే ప్రాంతాల్లో చోటుచేసుకోవడం కలకలం రేపింది. మొన్న ఆదివారం కిన్నౌర్ జిల్లాలోని సంగాల్ లోయలో కొండచరియలు విరిగిపడి, కిందున్న వాహనాలను ధ్వంసం చేయడంతో 9 మంది మరణించారు. ఇవాళ సిర్మౌర్ జిల్లాలోనూ అలాంటి విపత్తే తలెత్తింది..

 viral video: Himachal Pradesh landslide video, Sirmaur Road Collapse, NH 707 blocked

సిర్మౌర్ జిల్లాలోని మారుమూల షిలై ఉపవిభాగంలోని కాళి ధంక్‌ ప్రాంతంలో ఇవాళ కొండచరియలు విరిగిపడిన ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకున్నా, జాతీయ రహదారి ఒక్కసారిగా కుప్పకూలి లోయలోకి పడిపోయింది. సిర్మూర్‌లోని పాటా సాహిబ్ సిమ్లాలోని హట్కోటికి కలిపే నేషనల్ హైవే 707 మార్గం ఒక్కసారిగా లోయలోకి జారి పడిపోయిది. దీంతో హైవేను తాత్కాలికంగా మూసేారు.

సిర్మౌర్ లో కొండచరియలతోపాటే ఘాట్ రోడ్డు కుప్పకూలిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెద్ద కొండలోని ఓ భాగం కూలడం, దానితోపాటు రోడ్డు కూడా కుప్పకూలిన దృశ్యాలు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. హైవే కూలిపోయిన సమయంలో దానిపై వాహనాలేవీ లేవని, ప్రమాదం తర్వాత హైవేను తాత్కాలికంగా మూసేసి, వాహనాలను వేరే మార్గాలకు మళ్లించామని అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+