వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video : దేశ రాజధానిలో మహిళా జర్నలిస్టుకు అవమానం-చీరలో రెస్టారెంట్లోకి ఎంట్రీ నిరాకరణ

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా గుళ్లు, సైన్యంలో సైతం మహిళల ప్రవేశానికి దారులు తెరుచుకుంటున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మహిళల్ని అవమానించేలా ఓ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ మాల్ లోని రెస్టారెంట్లోకి మహిళను అనుమతించకుండా ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది.

మన దేశంలో చీర కట్టుకు ఉన్న విలువేంటో తెలియంది కాదు. భారతీయ సంప్రదాయనికి నిదర్శనంగా కనిపించే చీరకట్టులో కనిపించేందుకు సిటీ అమ్మాయిలు కూడా పోటీపడుతున్న రోజులివి. ఫ్యాషన్ షోల్లో సైతం చీరకట్టులోనే ర్యాంప్ వాక్ లు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో దక్షిణ ఢిల్లీలోని ఓ మాల్ లో ఉన్న రెస్టారెంట్లో చీరకట్టులో వచ్చిన ఓ మహిళను రానీయకుండా అడ్డుకున్న ఘటన కలకరం రేపుతోంది.

Viral video : South Delhi Restaurant denies entry to woman in saree

దక్షిణ ఢిల్లీలోని అన్సల్ ప్లాజా అనే మాల్ లో ఉన్న ఓ రెస్టారెంట్ కమ్ బార్ కు ఓ మహిళ వచ్చింది. ఆమె చీరకట్టులో కనిపిస్తోంది. దీంతో అక్కడి సిబ్బంది ఆమెను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అదేమని అడిగితే తమ రెస్టారెంట్ స్మార్ట్ డ్రెస్ కోడ్ లో చీర లేదని బదులిచ్చారు. దీంతో ఆమె సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. చివరికి ఆమెను మాత్రం అనుమతించలేదు. ఈ దృశ్యాల్ని మహిళా జర్నలిస్టు కూడా అయిన అనితా చౌదరి సోషల్ మీడియాలో పెట్టారు. ఇందులో తాను ధరించిన చీర స్మార్ట్ అవుట్ ఫిట్ కాదంట అనే క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

నిన్న నా చీర కారణంగా జరిగిన అవమానం నాకు ఇప్పటివరకు జరిగిన ఇతర అవమానాల కంటే పెద్దది, హృదయ విదారకమని అని ఆమె క్యాప్షన్‌లో పేర్కొంది. ఆ తర్వాత ఆమె యూట్యూబ్ లోనూ తనకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను అప్ లోడ్ చేసింది. తాను వివాహితను అని, తన పెళ్లి కూడా చీరలోనే జరిగిందని తెలిపింది. తనకు ఇద్దరు కుమార్తెలని, వారు తనను చీరలో చూసేందుకే ఇష్టపడతారని పేర్కొంది. తనకు చీరలంటే ఎంతో ఇష్టమని, భారతీయ సంప్రదాయాలంటే తనకు ఎంతో గౌరవమని కూడా యూట్యూబ్ ఛానల్లో పేర్కొంది. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చీరలు స్మార్ట్ దుస్తులుగా గుర్తించడం లేదని తెలిపింది.

English summary
a viral video shows restaurant in south delhi mall denied entry to a woman in saree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X