పట్టాలపై ట్రక్కును ఢీకొట్టిన రైలు.. అలా దూసుకెళ్లింది(వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో తృటిలో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ట్రక్కును రైలు ఢీకొన్న భయానక దృశ్యం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. కర్ణాటకలోని బీదర్‌లోని రైల్వే క్రాసింగ్‌లో ఇరుక్కుపోయిన ట్రక్కును రైలు ఢీకొట్టిన ఆఖరి క్షణాలను కెమెరా బంధించింది.
ట్విట్టర్‌లో ఏఎన్ఐ షేర్ చేసిన ఫుటేజ్‌లో రైలు ట్రక్కును ఢీకొట్టడానికి కొద్ది క్షణాల ముందు ప్రజలు రైల్వే క్రాసింగ్ నుంచి పారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆ తర్వాత ప్యాసింజర్ రైలు వేగాన్ని తగ్గించింది. ట్రక్కును ఢీకొట్టడానికి ముందు లోకో పైలట్ హార్డ్ బ్రేక్‌లను వర్తింపజేయడంతో రైలు కొంత నెమ్మదించింది. అయినా కూడా రైలు ఢీకొట్టిన తర్వాత కొద్ది దూరం వెళ్లి ఆగింది. వేగం తగ్గించడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
#WATCH Bidar, Karnataka | A train collided with a truck at Bhalki crossing, early this morning. No injury reported pic.twitter.com/9xYUUZTpcy
— ANI (@ANI) July 7, 2022












Click it and Unblock the Notifications