కోహ్లీ నా శిశ్యుడే, అందుకే గొప్పవాడయ్యాడు: డేరా బాబా సంచలనం(వీడియో)
టీమిండియా కెప్పెటన్ విరాట్ కోహ్లీపై డేరా సచ్ఛా సౌదా అధినేత, ఇద్దరు మహిళల అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఛండీఘర్: టీమిండియా కెప్పెటన్ విరాట్ కోహ్లీపై డేరా సచ్ఛా సౌదా అధినేత, ఇద్దరు మహిళల అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకున్న లక్షలాది మంది భక్తులలో విరాట్ కోహ్లీ ఒకరని వ్యాఖ్యానించాడు.
విరాట్ కోహ్లీ.. టీమిండియాలో కీలక పాత్ర పోషించడానికి తానే కారణమని గుర్మీత్ చెప్పుకొచ్చారు. ఆట ప్రారంభంలో మొదట విరాట్ కోహ్లీ తడబడే వాడని, తాను చెప్పిన సూత్రాలతోనే అతడు ఇంత పెద్ద క్రికెటరయ్యాడని చెప్పారు.
2016లో కోహ్లీకి మెళకువలు చెప్పినట్లు గుర్మీత్ తెలిపారు. అయితే, విరాట్ కోహ్లీ, ఆశీష్ నెహ్రాలు.. గుర్మీత్ బాబా వద్ద ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాల్ సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలతో పలు వీడియోలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications