వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్..అలర్ట్.. కరోనా వచ్చి తగ్గిందా.. 90 రోజులే సేఫ్, మళ్లీ వైరస్ సోకడం ఖాయం.. కారణాలివే..?

|
Google Oneindia TeluguNews

ఒకసారి కరోనా వైరస్ వచ్చి నయమైతే జీవితంలో మళ్లీ వైరస్ దరిచేరదని ఇప్పటివరకు విన్నాం. మన శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని స్పష్టంచేశారు. అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తి.. 90 రోజుల వరకే సేఫ్ అని.. తర్వాత వైరస్ సోకే అవకాశం ఉంది అని అధ్యయనంలో వెల్లడవుతోంది. దీంతో ఆందోళన నెలకొంది. వైరస్ తగ్గిన వారు.. మూడ్నెల్ల తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే మరోసారి కరోనా బారిన పడే ఛాన్స్ పుషల్కంగా ఉన్నాయి.

sero survey: ఈ వయస్సు వారిపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువే.. జర జాగ్రత్త సుమీ, హెచ్చరికలు..sero survey: ఈ వయస్సు వారిపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువే.. జర జాగ్రత్త సుమీ, హెచ్చరికలు..

28 రోజుల తర్వాతే.. ఎందుకంటే..

28 రోజుల తర్వాతే.. ఎందుకంటే..

వైరస్ వచ్చిన తర్వాత 28 రోజుల తర్వాత సదరు వ్యక్తి శరీరంలో వైరస్ జాడలేకున్నా.. అతడు/ఆమె వైరస్ వాహకంగా మారే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. దీంతోపాటు కరోనా వైరస్‌కి సంబంధించి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. అదీ ఏడాది వరకు మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత మరోసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. చికెన్ ఫాక్స్, హెచ్ఎఫ్ఎమ్ వ్యాధులకు సంబంధించి అభివృద్ధి చెందే ఐజీజీ యాంటిబాడీస్ జీవితకాలం 60 నుంచి 90 రోజులు మాత్రమే ఉంటాయి. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఐజీజీ యాంటీబాడీస్ శరీరంలో అభివృద్ది చెందిన.. అవీ ఏడాదికి మించి శరీరంలో ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు తెలిపారు.

4 రోజుల తర్వాత మొదలు.. బాడీ పార్ట్స్‌పై ప్రభావం

4 రోజుల తర్వాత మొదలు.. బాడీ పార్ట్స్‌పై ప్రభావం

వైరస్ సోకిన వ్యక్తి శరీరంలోకి నాలుగురోజుల తర్వాత ఐజీఎమ్ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. తర్వాత వ్యాధి తీవ్రస్థాయికి చేరి.. వివిధ అవయవాలపై ప్రభావం చూపిస్తోంది. ఊపిరితిత్తులు, నాడీమండలం, రక్త సరఫరా వ్యవస్థలను దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. వైరస్ ప్రవేశించిన 12వ రోజు నుంచి ఐజీజీ యాంటీ బాడీస్ డెవలపవుతాయని.. ఐజీజీ యాంటీబాడీస్ సంఖ్య పెరిగేకొద్దీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. 14వ రోజు నాటికి శరీరంలో వైరస్‌పై రోగనిరోధక శక్తి ఐజీజీ యాంటీబాడీస్ సాయంతో ఆధిపత్యం వహిస్తున్నందున.. రోగికి కరోనా వల్ల ఇబ్బందులు లేవు అని వైద్యులు నిర్దేశిస్తున్నారు. దీనిని ఆధారంగా తీసుకొని తిరిగి టెస్టులు కూడా నిర్వహించకుండా ఇంటికి పంపిస్తున్నారు.

ఒక్కొక్కరికీ ఒక్కొలా..

ఒక్కొక్కరికీ ఒక్కొలా..

ప్రతీ రోగి 12వ రోజు నుంచి ఐజీజీ యాంటీబాడీస్ ఒకేలా డెవపల్ కావు. ఒకవేళ అయినా.. పెద్ద సంఖ్యలో శరీరంలో చేరినంత మాత్రానా కరోనా పూర్తిగా నయమైనట్టు కాదు అని తెలిపారు. కానీ వైరస్ వల్ల రోగికి నష్టం వాటిల్లకుండా యాంటీబాడీస్ రక్షిస్తాయి. 14వ రోజు తర్వాత రోగి శరీరం నుంచి వైరల్ లోడ్ ఉంటుంది. నోరు, ముక్కు నుంచి వచ్చే తుంపరలు, మల మూత్రాలు.. శారీరక ద్రవాలు ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు.

28 రోజుల తర్వాతే ప్లాస్మా దానం.. కారణమిదే..?

28 రోజుల తర్వాతే ప్లాస్మా దానం.. కారణమిదే..?

14వ రోజు పూర్తయిన తర్వాత రోగి వినియోగించే టాయిలెట్ల ద్వారా ఇతరులకు వైరస్ వచ్చే అవకాశం ఉంది. మరో 14 రోజుల్లో రోగి శరీరం నుంచి వైరస్ పూర్తిగా బయటకు పోదు. అందువల్లే వైరస్ సోకిని 28 రోజుల తర్వాతే ప్లాస్మా దానానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ అంగీకరించాయి. ఈలోపు ప్లాస్మా సేకరిస్తే.. దాంతో పాటు వైరస్ వస్తుందని చెబుతున్నారు. వైరస్ సోకి తగ్గిన వ్యక్తి 28 రోజులపాటు దూరంగా ఉండాలని కోరుతున్నారు. చికెన్ పాక్స్, హెచ్ఎఫ్ఎమ్ డీసీజ్ వచ్చిన వారికి ఒకసారి వ్యాక్సిన్ ఇస్తే సరిపోయేది. కానీ కరోనా వైరస్ మాత్రం విభిన్నం.. వ్యాధి నయమైన 60 నుంచి 90 వరకు మాత్రమే సేఫ్ అని నిపుణులు చెబుతున్నారు.

Recommended Video

COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
ఏడాదికోసారి వ్యాక్సిన్ కంపల్సరీ..

ఏడాదికోసారి వ్యాక్సిన్ కంపల్సరీ..

వైరస్ తగ్గిన తర్వాత కూడా సదరు వ్యక్తులు సరైన జాగ్రత్తలు తీసుకొని శుభ్రంగా ఉండాలని చెబుతున్నారు. లేదంటే మరోసారి వైరస్ వస్తుందని.. అప్పుడు తొందరగా వ్యాధి తగ్గదని తెలిపారు. ఇదేకాదు వైరస్ నివారణ కోసం ఏడాదికోసారి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఐజీజీ బాండీయాడీస్ ఏడాది ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతోండగా.. రష్యా మాత్రం రెండేళ్లు అని ప్రకటించింది. కానీ భారత్, ఇతర దేశాలు మాత్రం ఏడాది తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నాయి. దీనికి సంబంధించి భవిష్యత్‌లో మరిన్ని వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జీవితకాలానికి సరిపోయే వ్యాక్సిన్ రూపకల్పనలో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. దీంతోపాటు కరోనా కోసం ఏడాదికి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు. దీనిని బట్టి కరోనాతో సహజీవనం తప్పనిసరి అని అర్థమవుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ముందడుగు వేయాల్సి ఉంది.

English summary
alert..alert..coronavirus prevented in humans.90 days after to be infected scientists said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X