రూ 27 వేలు ఇవ్వలేదని తల నరికి ఎత్తుకెళ్లాడు
బెంగళూరు: కేవలం రూ 27 వేలు తిరిగి ఇవ్వనందుకు స్నేహితుడిని అతి దారుణంగా హత్య చేసి అతని తల నరికి తీసుకు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. హత్య చేసిన యువకుడిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
బెంగళూరు గ్రామీణ జిల్లాలోని కేంపటిమ్మనహళ్ళి గ్రామంలో మంజునాథ్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, ఇతని స్నేహితుడు శివకుమార్. శివకుమార్ తండ్రి చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్నాడు. మంజునాథ్ సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ వ్యాపారం చేస్తున్నాడు.
మంజునాథ్ శివకుమార్ తండ్రి దగ్గర రూ. 27 వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న రుణం చెల్లించాలని శివకుమార్ చాల సార్లు అడిగాడు. అయితే తాను రుణం తిరిగి చెల్లించనని మంజునాథ్ మొండికేశాడు.
గత ఆదివారం రాత్రి శివకుమార్, మంజునాథ్ కలిసి బార్ లోకి వెళ్లి మద్యం సేవించారు. శివకుమార్ తన డబ్బుతోనే మంజునాథ్ కు మద్యం తీసిచ్చాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం మంజునాథ్ కు పీలదాక మద్యం తాగించాడు.
తరువాత నిర్జన ప్రదేశంలోకి మంజునాథ్ ను పిలుచుకుని వెళ్లి కత్తితో దారుణంగా పోడిచి హత్య చేశాడు. అంతటితో శాంతించని శివకుమార్ మంజునాథ్ మొండెం నుంచి తల వేరు చేశాడు.

రక్తం కారుతున్న తల చేతిలో పట్టుకుని మద్యం మత్తులోనే అతను విశ్వనాథపుర పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరాడు. పోలీస్ స్టేషన్ లో రక్తం కారుతున్న తల పెట్టిన శివకుమార్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు.
శివకుమార్, మంజునాథ్ పాత నేరస్తులని, వీరు వాహనాలు చోరీ చేసి పలు ప్రాంతాల్లో విక్రయించారని పోలీసు అధికారులు చెప్పారు. కేవలం రూ 27 వేల కోసం స్నేహితుడిని అంత దారుణంగా హత్య చేసిన యువకుడిని పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications